Monday, 24 July 2017

ఇ – కాప్స్ పైన జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజుల శిక్షణ

 ఇ – కాప్స్ పైన  జిల్లా పోలీస్ సిబ్బందికి  వారం రోజుల శిక్షణ 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24;  సిసిటీఎన్ఎస్ “ ఇ – కాప్స్” పైన జిల్లా పోలీస్ సిబ్బందికి  వారం రోజుల పాటు  శిక్షణ తరగతుల కార్యాక్రమం చేపడుతున్నాటు కుమ్రం భీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీసులకు సోమవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.జిల్లా లోని పోలీస్ సిబ్బందికి  24.07.2017 నుంచి 31.07.2017 వరకు క్రిమినల్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం  లోని ఇ- కాప్స్ పైన వారం రోజుల శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు , ఈ శిక్షణ వల్ల జిల్లా పోలీసులు ,జిల్లా లో జరిగే  అన్ని నేరాల నమోదు నుంచి శిక్ష పడే వరకు జరిగే ప్రక్రియ అంతయు కంప్యూటరికరించబడి  ఆన్ లైన్ లొ నిక్షిప్తం అవుతుందని , శిక్షణ వల్ల జిల్లా సిబ్బంది  పని తీరు మెరుగు పడి , నాణ్యమైన సేవలు అందిచే విధంగా వుంటాయిని  తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమము లో జిల్లా ఐ టి కోర్ సిబ్బంది జే .శ్రీనివాస్, యం. శ్రీనివాస్, సపోర్టింగ్ సిబ్బంది పి. రమేష్ , మాణిక్ రావు , మణి, మరియు జిల్లా పోలీస్ స్టేషన్ ల యొక్క రైటర్ లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment