సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం ; డీపిఓ గంగాధర్ గౌడ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 08 (వుదయం ప్రతినిధి) ; సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం అని డీపిఓ గంగాధర్ గౌడ్ అన్నారు. శనివారం రెబ్బన గ్రామా పంచాయితీ కార్యాలయం లో నూతన గ్రామా జ్యోతి కమిటీని ఏర్పాటు చేసి దత్తత తీసుకున్న గ్రామం లోని అభివృద్ధి కార్యక్రమాల ఫై సమీక్ష నిర్వహించారు.గ్రామం లో 100 శతం ఓడీఫ్ పథకం లో మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. పారిశుధ్యం, మంచినీటి ఏర్పాటు లో అభివృద్ధిని సాధించాం అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పేసరి వెంకటమ్మ, ఏఎంసీ వైస్ చెర్మన్ కుదారపు శెంకరమ్మ, ఉప్పసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, పంచాయితీ సెక్రేటి మురళీధర్, వెంకటేశ్వర్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్,చిరంజీవి,చెంద్రకళ,గ్రామస్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment