విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19; ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున రెబ్బెనలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు. గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని,కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టలని, అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పాలిటెక్నిక్ కళాశాల,ఐటీఐ కళాశాల మంజూరు చేయాలని ఈ బంద్ నిర్వహిస్తున్నమని అన్నారు.
No comments:
Post a Comment