ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యా పరిరక్షించాలని ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు.అనంతరం దుర్గం రవీందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు తెలుసుకోవాడానికి జిల్లా వ్యాప్తంగా సైకిల్ జాత నిర్వహించమని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని, సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి, డివిజన్ కార్యదర్శి పుదారి సాయి కిరణ్, మండల కార్యదర్శి ప్రణయ్, నాయకులు మహిపాల్, సంజయ్,శ్రావణ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment