Saturday, 22 July 2017

విద్యార్థులకు పోలింగ్ పై అవగాహణ

విద్యార్థులకు పోలింగ్ పై అవగాహణ 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22;   విద్యార్థులకు పోలింగ్ విధానం పైన అవగాహణ  పెంచేందుకు రెబ్బెన మండలం లేతనగూడ గ్రామంలో  ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రవికుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రజలు పొందిన అతి గొప్ప హక్కు ఓటు హక్కు అని అన్నారు.పాఠశాలలో వివిధ కమిటీలను ఎన్నుకోవడానికి విద్యార్థులకు మధ్య ఎన్నికలు నిర్వహించారు.కాగా పాఠశాల ప్రధానమంత్రిగా 5వ తరగతికి చెందిన కె.మహేష్ ను విద్యార్థులు ఎన్నుకున్నారు.అదే విధానంగా ఆహార,పరిశుభ్రత,క్రమశిక్షణ కమిటీలకు మంత్రులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జె.కవిత,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు తిరుపతమ్మ,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment