రాష్ట్ర మేదరి సంఘ సర్వ సభ్య సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 06 (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం సర్వసభ్య సమావేశం శనివారం నాడు హైదరాబాద్ మూసారాంబాగ్ లో జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో మేదరుల జీవన స్థితిగతులు,మేదరులను ఎస్ ట్ లో చేర్చుట,మేదరులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు మరియు నూతన కమిటీ మొదలగు అంశాలపై చేర్చ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని మేదరి సంఘాలు మరియు అనుబంధ సంఘాల అద్యక్షులులు,కార్యదర్సులతో సహా కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని తెలిపారు.
No comments:
Post a Comment