విద్య ,వైద్యం,ఉపాధి హక్కులకై లాంగ్ మార్చ్ ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ; విద్యా,వైద్యం,ఉపాధి హక్కుల సాధనకై దేశ వ్యాప్తంగా ఎఐఎస్ఏఫ్ ,ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ బస్సు యాత్రకు మద్దతుగా రెబ్బెన మండల కేంద్రంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ జెండా ఆవిష్కరించారు.అనంతరం రవీందర్ మాట్లాడుతూ దేశంలో దళితులపై,ఆదివాసులపై,గిరిజనులపై,మైనార్టిలపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు,ముస్లింలకు,గిరిజనులకు రక్షణ కరువైందని అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు,యువకులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నరాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న దాడులను అరికట్టలని ,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,దేశ వ్యాప్తంగా కామన్ విద్యా విధానం ప్రవేశ పెట్టాలని,నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల కార్యదర్శి మహిపాల్,జిల్లా సమితి సభ్యులు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment