విద్యా,వైద్యం,ఉపాధి హక్కులకై పోరాడుతాం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31; విద్యా,వైద్యం,ఉపాధి హక్కులకై పోరాడుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలియజేశారు. సోమవారం రోజున ఏఐఎస్ఎఫ్, ఎఐవైఏఫ్ లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. అనంతరం రవీందర్,పూదరి సాయి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సమస్యలు విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగంలో మతపరమైన విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్యంశాలలో ప్రవేశపెట్టేందుకు సంస్కరణలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని, శాస్త్రీయ విద్యావిధానం ప్రవేశపెట్టాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ , ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో కన్యాకుమారి నుండి హుస్సెనీవాలా పంజాబ్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నమని ఈ లాంగ్ మార్చ్ ఆగస్టు 3వ తేదీన మంచిర్యాల జిల్లాకు వస్తుందని అన్నారు. దేశంలో దళిత, ముస్లిం,గిరిజనులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ప్రభుత్వ విద్యారంగంలో కామన్, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని, విద్యా వ్యాపారాన్ని , మత పరమైన మూఢ విశ్వాసాల విద్య విధానాలను , విదేశీ విశ్వవిద్యాలయాలను అరికట్టాలని, ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని, అందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి రోజ్ గారి గ్యారెంటీ యాక్ట్ ను అమలు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలని, కెజి టు పిజి ఉచిత విద్యను అమలు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, లౌకికవాదాన్ని పరిరక్షించాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, సమగ్ర వైద్య విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి సాయికుమార్,ధర్మ,కార్తీక్,మహేష్,శ్రీనివాస్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment