కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 2 : బెల్లంపల్లి ఏరియా టిఎక్స్ టెన్షన్ ఓపెన్ కాస్ట్ డైవర్సిన్ కాల్వలో పడి సోలాపూర్ కు చెందిన కొమరం సుద్దు పటేల్ (65) గురువారం మృతి చెందారు . . గ్రామస్తులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గురువారం రాత్రి చేను కావలికి బయటికి వెళ్లిన వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున చేను సమీపంలోని ఓపెన్ కాస్ట్ డైవర్షన్ కాల్వలో పడి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వచ్చి యాజమాన్యం కాలువ చుట్టూ సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే అటుగా వెళ్లిన సుద్దు పటేల్ అదుపుతప్పి కాలంలో పడి మృతి చెందాడన్నారు దీంతో యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతుడి కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఖైర్ గూడా రోడ్డుపై రాస్తారొకో నిర్వహించారు . సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. సింగరేణి బొగ్గు లారీలు ఎక్కడికక్కడే నిలిచి నిలిచిపోయి బొగ్గు సరఫరా ఆగిపోయింది. విషయం తెలుసుకున్న రెబ్బెన సిఐ రమణమూర్తి , ఎస్వోటూ జిఎం సాయిబాబా, డిజిఎం పర్సనల్ కిరణ్ , టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనచేస్తున్న వారికి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు . ఈలోగా అక్కడికి చేరుకున్న బిజేపి జిల్లా అధ్యక్షులు జేపీపౌడెల్ , బిజెపి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారామ్ లు ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ తో ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయం కేంద్ర వోబీ కాంట్రాక్టులతో యాభై వేల రూపాయల నగదును, మృతుని ఇద్దరు కొడుకులకు కాంట్రాక్ట్ కార్మికులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అంతేకాకుండా మరి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు ఈ కార్యక్రమంలో డీవైపీఎంలు సుదర్శనం, రామశాస్త్రి , గోలేటి మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment