కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 3 : రాతపరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సై, కాన్స్టేబుల్ అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఇచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ భీమన స్టేడియంలో జీఎం కే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ ధారుడ్య పరీక్షా నిమిత్తం వివిధ ఈవెంట్లలో సుశిక్షితులైన శిక్షకులచే శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులకు ఉదయం గుడ్లు, పాలు అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుందన్నరు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జ్ కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు,స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారా స్వామి తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment