Monday, 5 November 2018

రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 5 ; రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రెబ్బెన గ్రామస్తులు మాజీ ఉప  సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆధ్వర్యంలో  సోమవారం  మండల తహసీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ కు వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్ నుండి రొజుకు 5 కోట్ల విలువగల బొగ్గు నిత్యం రవాణా   అవుతున్నదని గూడ్స్ రైళ్లు నిత్యం స్టేషన్ లో నిలిపి ఉంచడంతో ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల, హైదేరాబద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వయసు మళ్ళిన వారు, స్త్రీల కు బాగాఇబ్బందిగా ఉందన్నారు. సింగరేణి బొగ్గును దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా చేస్తూ రైల్వే శాఖా తమ రెవెన్యూ పెంచుకుంటూ ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతి నిత్యం ఆసిఫాబాద్ వంటి దూర ప్రాంతాలనుంచి తెల్లవారుజయమున  అర్  టి సి ఏర్పాటుచేసిన ప్రేత్యేక బస్సు సదుపాయంతో వందలమంది ప్రయాణికులు హైద్రాబాద్ కు వెళ్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది శ్రీనివాస్ గౌడ్, దుర్గం భరద్వాజ్, జహూర్ భాయ్, రామడుగుల శంకర్, మహేందర్, పాపయ్య, విలాస్, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment