Friday, 16 November 2018

సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతిక హక్కుతెరాస కు లేదు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 16 : సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు పరచడంలో తెరాస శాసనసభ్యులు విఫలం చెందారని వారికి సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. శుక్రవారం గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతు గత సింగరేణి  ఎన్నికల సందర్బంగా గనులు, ఓసీపీలలో  ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం మాటలతో మభ్యపెట్టారని అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలల దసరాకు ఓటెయ్యండి దీపావారికి కారుణ్య నియామకాలు అని,వడ్డీలేని  ఇంటి    రుణాలని , పెరుమార్పిడి వేగవంతం చేస్తామని కార్మికులను  మభ్యపెట్టి  పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. కార్మికులకు ఎలాంటి సమస్యవచ్చినా కేవలం ఫోన్ చేస్తే వస్తామన్న ఎం ఎల్ ఏ  లు కోవలక్ష్మి, దుర్గం చిన్నయ్య ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చారని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల కోసం మళ్ళి  వస్తున్నారని, దీనిని కార్మికులు గమనించి తగిన బుద్ధి   చెప్పాలని అన్నారు. బెల్లంపల్లి , ఆసిఫాబాద్ ఎన్నికలలోమహాకూటమి అభ్యర్థులకు వోట్ వేసి తెరాస కు గుణపాఠం  చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య, సి పి  ఐ మండలాకార్యదర్శి రాయిలా నర్సయ్య, వ్యవసాయ సంఘ కార్యదర్శి బానోతు కిషన్, ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్, ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి కిరణ్, నాయకులు  నర్సయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment