కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 : లారీ ల ఆర్ సీ ప్రకారం బొగ్గు లోడ్ ను నింపాలని సింగరేణిలో బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టు లారీ యజమానులు ఎన్ ప్రభాకర్, సి హెచ్ రంగారావు ల ఆధ్వర్యంలో శనివారం రెబ్బెన బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎం కే రవిశంకర్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం లారీ యజమానులు మాట్లాడుతూ ఓవర్ లోడ్ చేయడం వలన లారీ లకు బ్రేకులు సరిగా పడక మార్గమధ్యంలో ప్రమాదాలకు కారణమవు తున్నామని, ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని, ఏదైనా ప్రమాదం జరిగితే యజమానులు ఆర్ధికంగా నష్టపోవలసి వస్తున్నదని, కుటుంబ పోషణ భారమౌతున్నదని, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతభత్యాలు సరిగా చెలించలేని పరిస్థితి రావడంతో కొంతమంది యజమానులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారని కావున దయవుంచి లారీ అర్ సి ప్రకారం సింగరేణి సంస్థ బొగ్గును నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో లారీల యజమానులు సతీష్, వెంకన్న, పోశెట్టి, మహేష్, రాజన్న, ప్రసాద్, కార్తిక్, తిరుపతి, అశోక్, రమేష్, మధుకర్, జగదీష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment