కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 : పాలన చేతగాక చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను వంచించి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ నాయకత్వంలోని తెరాస ను చిత్తుగా ఓడించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కె విశ్వ ప్రసాద్ అన్నారు. రెబ్బెన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంగాపూర్ గ్రామస్తులు ఓల్వోజు వెంకటేశం చారి అధ్యర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్, రెబ్బెనకు చెందిన తెరాస మండల మహిళా కార్యదర్శి అన్నపూర్ణ అరుణ లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కె విశ్వ ప్రసాద్ డిసిసి ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్ రావులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ .కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించడం వల్ల ముందుగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఐదు లక్షల రూపాయల రైతు భీమా. వృద్దులకు,వికలాంగులకు,వితంతువులకు 2 వేల నుండి 3 వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు3 వేల నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చే వరకు అందజేయడం జరుతుందని అదేవిదంగా ప్రతి పేదింటి వారికి సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ,మహిళలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంజం రవీందర్ సింగల్ విండో చైర్మన్ గాజుల రవీందర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అనిశెట్టి వెంకన్న, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుర్లే రామచందర్, ముంజం వినోద్, గందె సంతోష్, ఇగురపు రవీందర్, ముంజం శ్యామరావు, మదన్, కిషన్, లెండుగురే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment