కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 22 : ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శిగా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన పర్వతి సాయిని ఎన్నుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షలు ,కార్యదర్శులు వికాస్, దుర్గం రవీందర్ లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పర్వతి సాయి విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాడని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పర్వతి సాయి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం నిర్వహిస్తానని, విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్య పరిచి విద్యార్థులహక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో డివిజన్ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment