
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 : అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డి ఎస్ పి సత్యనారాయణ అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఓటర్లలో భరోసా కల్పించడానికి పోలీసులు శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై, గోలేటిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి సత్యనారాయణ మాట్లాడారు. సమాజంలోని ప్రజలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పిస్తుందని,ప్రజలు తమ ఓటు హక్కును స్వేచయుతంగా వినియోగించుకోవాల్సిందిగా తెల్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో సామాన్యుడి వద్ద ఉన్న ఉన్న ఒకే ఒక్క ఆయుధం వోట్ హక్కు అని దానిని ఎటువంటి ప్రలోభాలకు లోనుగాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి, ఎస్సై దీకొండ రమేష్ , సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment