కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 19 : కార్మిక వ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్న తెరాస ను ఓడించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పిలుపునిచ్చారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటిలోని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ బాబు ఆధ్వర్యంలో కెఎల్ మహేంద్ర భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గంసమావేశం లో మాట్లాడారు. డిసెంబర్ ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అమలుపరచి కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయిన టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఎన్నికల హామీలను అమలు పరచడంలో విఫలమైందని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం పద్దెనిమిదివేల చెల్లించాలని చెప్పారు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని తాము రాష్ట్ర సాధనలో కార్మిక పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కెసిఆర్ మాట్లాడిన రోజు లేదని రాబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని అన్నారు. మహాకూటమి లోని అందరు అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. యూనియన్ నియమ నిబంధనలను పాటించని . పలువురిని ఏఐటీయూసీ నుండితొలగించామన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అమలు పరుస్తున్న జిల్లా అధ్యక్షుడు అంబాల ఓదెలు , ఉపాధ్యక్షులు సీ హెచ్ శంకర్ జిల్లా కార్యదర్శి రాజాగౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శివాజీలను ఏఐటీయూసీ నుంచి తొలగిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ తెలిపారు . వీరందరూ కాగజ్ నగర్లో యూనియన్ నియమ నిబంధనలకు వ్యతిరేకం గా పనిచేస్తున్నందుకు తొలగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లాప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, జిల్లాకార్యదర్సులు జగ్గయ్య , మచ్చ బాపు, కోశాధికారి దుర్గం వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఎస్ తిరుపతి, హేమాజీ తడిఆరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment