Tuesday, 13 November 2018

ఎన్నికల హామీలు ఏం నెరవేర్చారని ముందస్తు ఎన్నికలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 : ప్రజలకు చేసిన  ఎన్నికల హామీలు ఏం నెరవేర్చారని ముందస్తు ఎన్నికలు  ఎవరి కోసం అని సిపిఐ మండల కార్యదర్శి  రాయల నర్సయ్య ప్రశ్నించారు. . మంగళవారం రెబ్బెన మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలైన దళితుని ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, నీరుడుయోగులకు లక్ష ఉద్యోగాలు  ఇంటింటికి నల్ల నీరు, వంటి వాటిని పూర్తిగా మరచి, గొర్రెలు , బర్రెలు  అంటూ  ప్రజలను మాయ మాటలతో మభ్య పెడుతూ,ప్రజలిచ్చిన 5 సంవత్సరాల పాలన సమయాన్ని పాలన చేతగాక 4 ఏళ్లకే చతికిలపడి, కేవలం తన 4 గురు కుటుంబ సభ్యులకు మాత్రం పదవులిచ్చి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజావ్యతిరేక సిద్ధాంతాలను ఇక ఏమాత్రం సహించకుడన్న ధేయంతో మహాకూటమి ఏర్పాటు చేశామని ప్రజలు పై విషయాలను గమనంలో ఉంచుకొని రాబోయే ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులను ఆదరించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి పి  ఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామడుగు శంకర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కుందారపు బాసవయ్య, జిల్లా కార్యదర్శి జాడి గణేష్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అనుముల రమేష్, ఏఐటీయూసీ రెబ్బెన మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, ఉపాధ్యక్షులు గోగర్ల శంకర్, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment