కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 9 : రెబ్బెనలో శుక్రవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెరాస జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ఎంతో కృషి చేసన కోసం పురాణం సతీష్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను చేరుకోవలన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు టీఆరెస్ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్కుమార్ జడ్పీటీసీ బాబురావు బొమ్మినేని శ్రీధర్ కుమార్ దుర్గం భరద్వాజ్, పెసరు మదునయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment