Saturday, 3 November 2018

అప్పు తీర్చమని వేధించడంతో తనువు చాలించిన యువకుడు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : 5 వేలు అప్పుతీర్చమని  యువకుడి ని వేధించడంతో అవసరం కోసం తీసుకున్న అప్పు యువకుడ్ని తనువు చాలించే లా చేసింది.  అప్పుగా ఇచ్చిన వ్యక్తి వెంటపడి వేధింపులకు గురి చేయడంతో సకాలంలోచేతికి డబ్బులు అందక  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తనువూ చాలించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.  శనివారం వెలుగులోకి రాగా వచ్చింది. రెబ్బెమ ఎసై   దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన  మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు వయస్సు ఇరవై స్థానికంగా ఉన్న జిరాక్ సెంటర్లో పనిచేస్తుండే వాడు అవసరం నిమిత్తం అత్యవసరంగా ఐదువేల రూపాయలు కావాల్సి రావడంతో మండల కేంద్రంలోని చెందిన ఫైనాన్స్ వ్యాపారి మారిన రవితేజ వద్ద  అప్పు తీసుకున్నాడు అయితే తీసుకున్న అప్పును తిరిగి సకాలంలో చెల్లించడంలో కిరణ్ బాబు విఫలం కావడంతో అప్పుగా ఇచ్చిన డబ్బుల కోసం రవితేజ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో గత ముప్పై వ తేది మోటార్ సైకిల్ పై వస్తున్న కిరణ్ బాబుని అడ్డగించిన రవితేజ మోటార్  సైకిల్  లాక్కొడం తో కిరణ్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు మోటార్ సైకిళ్ల లాక్కోవడంతో పాటు  ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ముందే దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కిరణ్ క్రిమి సంహారక  మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు గమనించిన కుటుంబ కుటుంబ సభ్యులు హుటాహుటిన బెల్లంపెల్లి  ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుండిమంచిర్యాల లోని ఒక ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతోహైదేరాబద్ కు  తరలించగా శుక్రవారం మృతి చెందాడు దాంతో మృతుడి నానమ్మ వెంకట వెంకటనరసమ్మ శనివారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో చేసిన   ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి   దర్యాపు చేస్తున్నట్టు తెలిపారు.

No comments:

Post a Comment