కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 2 : రెబ్బెన మండలం ఖైర్గుడా గ్రామంలో శుక్రవారం మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆబ్కారీ ఎస్సై టి నరసింహా చారి తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో నాగు వెంబడి ఉన్న తయారీ కంద్రాలలో 600 లీటర్ల బెల్లం పానకం ను నేలమట్టం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు. ఈ దాడులలో కమలాకర్, మమత, సురేష్, తిరుపతి, నాగరాజు తదితర సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment