Friday, 2 November 2018

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 2 :   పోలీస్ రిక్రూట్మెంట్  ప్రక్రియలో భాగంగా బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణను అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని డిజిఎం పర్సనల్ కిరణ్ కోరారు.  శుక్రవారం గోలేటి టౌన్ షిప్  భీమన స్టేడియంలో శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు శారీరక దేహదారుడ్య పరీక్షలు నిర్వహించారు.  ఏరియా పరిధిలోని కార్మికులు మాజీ కార్మికుల పిల్లలు ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల నుండి సుమారు తొంభై మంది అభ్యర్థులు హాజరు కాగా సింగరేణి డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్  ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియా  పరిధిలోని నిరుద్యోగులకు యాజమాన్యం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు . గతంలో నిరుద్యోగ యువతకు అందించిన ఆర్మీ పోలీస్ స్క్రీన్స్ శిక్షణ ద్వారా ఎంతోమంది యువకులు పోలీసు ఉద్యోగాలు సాధించారని అన్నారు దానిలోభాగంగా ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఉచితంగా ఫిజికల్   శిక్షణ అందించాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు శనివారం నుండి ప్రారంభమయ్యే శిక్షణ డిసెంబర్ పది  వరకు కొనసాగుతుందని శిక్షణ ను అభ్యర్థులు  సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీవైపీఎం రాజేశ్వర్,  స్పోర్ట్స్ సూపర్ వైజర్   రమేష్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment