కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 15 : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం రెబ్బెన మండలంలోని లేతన్ గూడా రైల్వే గేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా 640 సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు. రెబ్బెన ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో మౌలికవసతులు కల్పించాలని, ముఖ్యంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను నిర్మించాలని, స్టేషన్ లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఎక్సప్రెస్ ట్రైన్లను ఆపాలని రెబ్బెన జడ్పీటీసీ బాబు రావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, నాయకులు బొమ్మినేని శ్రీధర్, కుందారపు శంకరమ్మ, జహూర్, చోటు, అప్పు, అన్నపూర్ణ అరుణ, నవీన్ జైస్వాల్, వినోద్ జైస్వాల్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, భార్గవ్ గౌడ్, తదితరులు వినతి పత్రం అందచేసి మాట్లాడారు. నిజాం కాలం నటి నుండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన రైల్వే కేంద్రంగా ఉండి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధానితో కలిపే ఏకైక రైల్వే స్టేషన్ ను ప్రస్తుతం రైల్వే అధికారులు పట్టించుకోవాలని కోరారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సమస్యలపై అధ్యాయం చేసి సానుకూలంగా స్పందిస్తానని అన్నారు.
No comments:
Post a Comment