కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం రెబ్బెన మండలంలో ఊపందుకుంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మండల స్థాయి నాయకులు ఇంటింటికి తిరిగి తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, తెరాస పార్టీలకు చెందిన శ్రేణులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. తెరాస పార్టీ కార్యకర్తలు గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెపుతూ తమ అభ్యర్థిని గెలిపించలని ప్రచారం నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment