కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 5 ; ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ఆసిఫాబాద్ అసెంబ్లీ అభ్యర్థి ఆత్రంసక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డి సి సి ఉపాధ్యక్షులు కే విశ్వ ప్రసాద్ లు అన్నారు. సోమవారం రెబ్బెన గ్రామ మహిళలు పుంజుమేర గూడ గ్రామస్తులు జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాష్ రావ్, పార్టీ మండల అధ్యక్షులు ముంజం రవీందర్ ఆధ్వర్యంలో టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ డి సి సి ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్ రావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. అభివృద్ధికై ప్రశ్నించిన వారిని తప్పుడు కేసు లు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. దేశాన్న్ని అభివృద్ధి బాటలో పయనింప చేసింది కాంగ్రస్ అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు సైనికులు గా పనిచేసి మహాకూటమి అధికారం లోకి రావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రతి కార్యకర్త సామాన్య ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. తెలంగాణా సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చిన తెరాస గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కోవూరు శ్రీ నివాస్, రెబ్బెన టౌన్ అధ్యక్షులు మురళి, మండల ఉపాధ్యక్షులు రాజేష్ , ఎస్ టి నాయకులు రమేష్,అనిశెట్టి వెంకన్న, గోపి,కాంతారావు ,పద్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment