కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 8 ; ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆఅసిఫాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. గురువారం రెబ్బెన మండలం కిష్టాపూర్ తెరాస పార్టీ కి చెందిన కార్యకర్తలను , యువకులకు వారందరికీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయం లోనే అభివృద్ధి జరిగిందని, తెరాస నాలుగేళ్ళ పాలనలో గ్రామాలలో అభివృద్ధి కుంటూ పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై నమ్మకముంచి పార్టీ లో చేరిక కోసం ముందుకు వచ్చిన యువకులందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని ఆదరించి ఎన్నికలలో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పల్లె ప్రకాష్ రావ్, పాక్స్ వైస్ ఛైర్మన్ వెంకటేశం చారి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, అల్లే గణేష్ , మల్లయ్య, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment