Tuesday, 13 November 2018

గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించని పంచాయతీ కార్యదర్శి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 :  గత ఎనిమిది నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయితీ కార్యదర్శి  వేతనాలు చెల్లించడంలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్ ఆరోపించారు. మంగళవారం రెబ్బెన ఎంపీడీఓ కు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.  కార్మికులు, కుటుంబ సభ్యులు పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ఎంపీడీఓ ఈ విషయం పై కలుగ చేసుకొని జీతాలను త్వరగా చెల్లించేలా ఆదేశాలు జారీ  చేయాలని కోరారు. కానీ పక్షంలో  ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, ఉపాధ్యక్షులు లాల్ సింగ్, గోగర్ల శంకర్, ఎల్లల పోశం,   కార్యదర్శి దుర్గం వెంకటష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment