Friday, 2 November 2018

ఎన్నికలలో కాంగ్రెస్ జండా ను ఎగురవేయాలి ; ఆత్రంసక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 2 :   రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ దొంగల భరతం పట్టే   రోజు దగ్గర పడిందని  ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో వారిని తరిమి కొట్టి కాంగ్రెస్ జండాను ఎగురవేయాలని ఆసిఫాబాద్ మాజీ ఎం ఎల్ ఏ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రంసక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  డి సి సి ఉపాధ్యక్షులు  కే విశ్వ ప్రసాద్ లు అన్నారు. శుక్రవారం  రెబ్బెన మండల కేంద్రంలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ   సందర్భంగా మాట్లాడుతూ రెబ్బెన మండలంలో కాంగ్రెస్ హయం లోనే పలు అభివృద్ధి పనులు జరిగాయని, సింగరేణి సంస్థ దాతృత్వంతో ఇచ్చిన నిధులను అభివృద్ధికి వాడి మండల ప్రజలను మోసం చేశారన్నారు. అభివృద్ధికై ప్రశ్నించిన వారిని తప్పుడు కేసు లు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు భద్రత కల్పించే పోలీసులే అధికారంలో ఉన్న పార్టీ కి ప్రైవేట్ సైన్యం లా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణా కోసం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారని అన్నారు. తెలంగాణా  ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దేశాన్న్ని అభివృద్ధి బాటలో పయనింప చేసింది కాంగ్రస్ అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు సైనికులు గా పనిచేసి మహాకూటమి అధికారం లోకి రావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రతి కార్యకర్త సామాన్య ప్రజలకు చేరువ చేయాలని  అన్నారు.  తెలంగాణా సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చిన తెరాస గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి, చదువుకున్నా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కే జి త్వో పి  జి ఉచిత నిర్బంధ విద్య వంటి హామీలను తుంగలో తొక్కి, ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మద్దతు ధరకై రోడెక్కిన రైతులను దమన నీతితో  అరెస్ట్ చేయించారన్నారు.  విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న  రాష్ట్రం  ఇపుడు అప్పుల ఊబిలో కురుకున్నాద న్నారు. ప్రజలు ఎంతో  ఆశతో బంగారు తెలంగాణా  అవుతుందని భావించి అధికారం కట్టబెడితే  ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రులుగా, ఎం పి  లు గా ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకొని నిరుద్యోగులను  మోసం చేశాడన్నారు.  రాష్ట్ర పరిపాలన అంతా  తన కుటుంబ సభ్యుల చేతిలో కేంద్రీకృతం చేసి మంత్రులను కీలుబొమ్మ లుగా మార్చాడని, పాలన చేతగాక నాలుగు సంవత్సరాలకే తోకముడిచి  ప్రజలను మరల మోసం చేయడానికి వస్తున్నాడని అన్నారు. ముఖ్యంగా తెలంగాణా ప్రజలు బానిసత్వం పై పోరాడారని మరల ఆ  దొరల పాలన కోరుకొవడం లేదని, కావున ప్రజలు రాబోయే ఎన్నికలలలో మహాకూటమిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని  కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ పల్లె ప్రకాశం రావు, మండల పార్టీ అధ్యక్షుడు  ముంజం రవీందర్, ఎంపిటిసి కోవూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్, గాజుల రవి,  వివి వెంకన్న చారి,  యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ సంతోష్, సొగల వమాన్, పూదరి హరీష్ ,సురేందర్ రాజు, కేసరి కిషన్ గౌడ్, సంగం బానయ్య, పల్లస్  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment