కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 18 : తెలంగాణా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి రానున్న ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి టి వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి లోని కే ఎల్ మహేంద్ర భవన్ లో రాయిలా నర్సయ్య అధ్యక్షతన జరిగిన జిల్లావ్యావసాయ కార్మిక సంఘం సమావేశంలో ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలలో తెరాస ఇచ్చిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి, కే జి టూ పి జి ఉచిత విద్య, లక్ష ఉద్యోగాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు , కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదన్నారు. ప్రజలను మోసం చేసిన తెరాస నాయకులూ మల్లి మోసం చేయడానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రజలు పై విషయాలను గమనించి తగిన ఉద్ది చెప్పాలని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు చేసింది ఏమిలేదని, వందల ఎకరాలు ఉన్నా బడా భూస్వాములకు ఎకరాకు 4 వేల చొప్పున లక్షలాది రూపాయాలు ముట్టచెప్పారని అన్నారు. తెలంగాణా అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టి డి పి , సి పి ఐ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. డిసెంబర్ 15, 16, 17 తేదీలలో ఢిల్లీ లో జరుగనున్న భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పూదరి ఐ, జాడి సాయి, మహేందర్, అర్జున్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment