కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 12 : ఆసిఫాబాద్ రోడ్ రేపల్ల్వాడు రైల్వే స్టేషన్ల మధ్యలోని తక్కలపల్లి గేట్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి తక్కలపల్లి గ్రామానికి చెందిన నాయికిని చంద్రయ్య (70) ఆత్మాహత్యకు పాల్పడ్డట్లు జిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సత్తయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చంద్రయ్య భార్య గత ముప్పై సంవత్సరాల క్రితమే మృతి చెందగా పిల్లలు పెళ్ళిళ్ళు పూర్తిచేసి ఒంటరిగానే జీవిస్తున్నాడు క్రమేపీ వయసుపై పడటంతో పాటు ఆరోగ్యం క్షీణించి మద్యానికి బానిసై ఆరోగ్యం అస్సలు సహకరించక పోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్న చంద్రయ్య నిరాకరిస్తూ వచ్చాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఎవరికీ భారం కావద్దనే ఉద్దేశ్యంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆదివారం ఇంటి నుండి బయలుదేరాడు సోమవారం తెల్లవారుజామున తక్కలపల్లి గేట్ సమీపంలో ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తూ ఆఫ్లైన్ పై వస్తున్న గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుడికి నలుగురు కుమారులు ఒక కుమార్తె లు ఉన్నారు జీఆర్పీ ఎస్సై జితేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment