కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 17 : పోలీసులలో కూడా మానవీయ కోణం ఉంటుందని రెబ్బెన సి ఐ వి వి రమణ మూర్తి అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా శనివారం రెబ్బెన మండలం లోని సోనాపూర్ కొలంగూడ గ్రామంలో నిత్యవసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, నిషేదిత గుట్కాలు, గుడుంబా విక్రయించరాదని, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు. రోడ్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రజలు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్, గ్రామ పటేల్ జంగు , గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment