Thursday, 8 November 2018

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 8 ;   రెబ్బెన మండలం  నంబాల గ్రామానికి చెందిన మిట్ట లింగయ్య(65)  గురువారం రాత్రి పురుగుల మందు సేవించి మృతి చెందినట్టు రెబ్బెన ఏ  ఎస్సై  దేవరాజ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మిట్ట లింగయ్యకు చిన్నతనం లోనే తల్లిదండ్రులు చని పోవటం తో  అక్క  పూదరి లస్మక్క   తమ్ముడు మిట్ట లింగయ్యను చేరదీసి పెంచిపెద్ద చేసింది. తల్లిదండ్రులు చిన్నతనం లోనే మృతి చెందిన కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురావటంతో మతిస్థిమితం సరిగా లేనికారణంగా వివాహం కూడా కాలేదు దాంతో నంబాల లోని అక్క వద్దే జీవిస్తున్నాడు. ఈక్రమం లో గత వారం రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుందని దగ్గరున్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్లి పెయిన్   కిల్లర్లు వేసుకున్నా కూడా   ఉపశమనం రాక పోవ డంతో కుటుంబ సభ్యులు  పెద్దాసుపత్రికి తీసుకు వెల్దామనుకున్నారు. ఈలోగా కుటుంబ సభ్యులు  గురువారం రాత్రి దీపావళి నోముల హడావిడిలో ఉండగా భోజనం చేసి బయటకు వెళ్లిన లింగయ్య  పత్తి   పంటకు  చల్లే పురుగు మందును  సేవించి అస్వస్థతకు  గురికావడంతో  నంబాల గ్రామంలోని ఆర్ ఎం పి   వైదుడి వద్దకు అక్కడనుంచి బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మేనల్లుడు పూదరి భీం రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment