కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 13 : యువత ఎయిడ్స్ పై అవగాహన పెంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా ఆరోగ్యవిభాగం ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కే సీతారాం అన్నారు. మంగళవారం రెబ్బెన మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎన్ ఎస్ ఎస్ మరియు ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కే శంకర్ అధ్యక్షతన జరిగిన ఎయిడ్స్ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ ఓ ప్రమాదకరమైన అంట వ్యాధి అని దీని బారిన పడకుండా యువత ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. ఎయిడ్స్, హెచ్ ఐ వి పై నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కో ఆర్డినేటర్ రమేష్, జాతీయ సేవా పథకం అధికారులు ప్రకాష్,సీనియర్ అధ్యాపకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment