Monday, 26 November 2018

శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది మన రాజ్యాంగ ఫలమే


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 26 :  వివిధ కులాల మతాల సంస్కృతుల ప్రాంతాల భారతీయులు  శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది మన రాజ్యాంగ  ఫలమే అని  జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ బొల్లారం బిక్షపతి అన్నారు. సోమవారం  రెబ్బెన మండలం నక్కల గూడ   ప్రాథమిక పాఠశాలలో 69వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై .  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశానికి  సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత మన రాజ్యాంగం దేనని అన్నారు.  మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కృషి కొనియాడదగినది అని తెలియజేశారు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్  మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పట్టిందని రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దార్శనికత నేటికీ సజీవంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగం విషయాలపై  నిర్వహించిన ఉపన్యాస, క్విజ్  పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  జిల్లా విద్యాధికారి శ్రీ బిక్షపతిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులకు గ్రామర్ బుక్స్ డిక్షనరీలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ మీసాల  పోష మల్లు పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం,  ఖాదర్ మొహియుద్దీన్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్   డి రవికుమార్  బొంగు శ్రీనివాస్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.అదే విధంగా మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

No comments:

Post a Comment