Thursday, 8 November 2018

జిల్లా కేంద్రంలో నేడు బీజేపీ బహిరంగ సభ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 8 ; అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కేంద్ర మైన  ఆసిఫాబాద్లో నేడు  భారీ బహిరంగ జరపనున్నట్లు బీజేపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అజమీర ఆత్మారాం ఆధ్వర్యంలో స్థానిక ప్రేమల గార్డెన్ లో ఈ సభకు ఏర్పాట్లు చేశామని, ఈ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు , బీజేపీ జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్ తదితర జిల్లా నాయకులూ   హాజరు కానున్నట్లు తెలిపారు.   కావున  ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి ప్రజలు. బీజేపీ నేతలు,కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ఎబివిపి నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ సభకి వేలా దిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని  కోరారు

No comments:

Post a Comment