Sunday, 18 November 2018

పార్టీ కోసం నిజాయితితో పనిచేసేవారికి తెరాస లో గుర్తింపు లేదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 18 : పార్టీ కోసం నిజాయితితో పనిచేసేవారికి తెరాస లో గుర్తింపులేదని  రెబ్బెన  మాజీ జడ్పీటిసి దుర్గం సోమయ్య, గంగాపూర్  మాజీ సర్పంచ్ లెండుగూరి గంటు  మేర లు  అన్నారు.  తెరాస పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ  ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో తెరాస  ప్రజాప్రతినిధులు విఫలమవటంతో పాటు పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేసిన గుర్తింపు లేకపోవడంతో తమతో పాటు గంగాపూర్ మాజీ ఎంపీ టీసీలు లక్ష్మి బాయి , లెందుగురే పోచుబాయి లు సైతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు .  ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు  పట్టించుకోవడంలేదన్నారు.  భూ సర్వేతో కొత్త పాస్ పుస్తకాలు రాక మండలాల్లో ముప్పై అయిదు శాతం రైతులు వ్యవసాయ రుణాలకు దూరమయ్యారని అన్నారు . పాసు పుస్తకాలు లేక కొత్త పహాణీలు పొందకపోవడంతో రైతు బంధు పథకానికి అనర్హులుగా మారారని పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవటం లేదన్నారు.  భూసర్వే మూలంగామండలం లోని గోలేటి,  నంబాల , గంగాపూర్,  తుంగేడ   తక్కలపల్లి గ్రామాల్లో అటవీ భూమి పేరుతో వందలాది మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు.  రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.   అయినప్పటికీ పార్టీ కోసం పాటుపడుతున్నా పారాచూట్ నాయకులను అందలం ఎక్కించినందుకు   నిరాశకు గురై పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment