కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 17 : రెబ్బెన మండల తెరాస టౌన్ మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ రాజీనామా చేశారు. రాజీనామాను జిల్లా తెరాస మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మకు శుక్రవారం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ రెబ్బెన తెరాస పార్టీ నాయకులూ తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తన పై కక్షకట్టి అప్రతిష్ట పాలు చే స్తున్నందువల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తెరాస పార్టీ కోసం అహోరాత్రాలు శ్రమించానని, దానికి గుర్తింపు లేకుండాపోయిందని వాపోయారు. ఈ విషయాలను గమనించి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment