Friday, 2 November 2018

ఆసిఫాబాద్ బీజేపీ ఎం ఎల్ ఏ అభ్యర్థి అజ్మీర ఆత్మారాం నాయక్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 2 :    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరుపున అజ్మేర ఆత్మరామ్   నాయక్  టికెట్ ఖరారైనట్లు  జిల్లా అధ్యక్షులు జెపి పాెడెలు తెలిపారు.   శుక్రవారం రెబ్బెన  మండలంలోని గోలేటి బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ తరపున ప్రజలకు సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంటానని అజ్మేర ఆత్మ రామ్ నాయక్ అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు,   పనులు కూడ చేయలేక పోయిందని ప్రజల ఆశీర్వాదం ఉంటే కచ్చితంగా ప్రజలకు అందుబాటులో తాను ఉంటానని ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపారు బిజెపి పార్టీ నుంచి ప్రజలు గెలిపించాలని   అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ కోరారు. బిజెపి పార్టీ తరపున  అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ కు ఎం ఎల్ ఏ   టిక్కెట్ వచ్చినందుకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు జ్ బి  పౌడెల్  అజ్మేరా ఆత్మ రామ్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన యువకులు తమ పార్టీలో చేరడం జరుగుతుందని తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్, కిసాన్ మోర్చా  జిల్లా  అధ్యక్షుడు సునీల్ చౌదరి  మరియు జిల్లా పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment