కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 12 : దేశవ్యాప్తంగా మధ్యాహ్న్న భోజన పథకం కార్మికుల చలో పార్లమెంట్ పిలుపునకు సన్నద్ధంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బి ఉపేందర్ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మధ్యాహ్నా భోజన కార్మికులు చాలీ చాలని వేతనాలతోఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారంకోసం కేంద్ర కార్మిక సంఘం చలో ఢిల్లీ పిలుపునిచ్చిందన్నారు. . డిమాండ్లలో ముఖ్యమైనవి వారిని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, పి ఎఫ్ , ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున మండలంలోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో విజయ, లక్ష్మి, పార్వతి, శాంకరి, లాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment