Monday, 31 July 2017

వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి   

   ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31; నిరక్షరాస్యులైన వయోజనులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపిఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారంనాడు రెబ్బెన మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విసిఓ ల సమావేశంలో ఆయన  పాల్గొని మాట్లాడారు.సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోజన విద్యా కేంద్రాలను సమయ పాలనా పాటిస్తూ తెరవాలని సూచించారు.ఒక్కో విసిఓ పది మంది సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని,వారిని ఆగస్టు 20వ తేదీన నిర్వహించే  ఎన్ఐఓఎస్ పరీక్షకు సిద్ధం చెయ్యాలని విసిఓలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ కో ఆర్డినేటర్  గాంధర్ల సాయిబాబా,మండలంలోని విసిఓలు పాల్గొన్నారు.

బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి


బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి

  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31;  బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో  గోలేటిలోని  దుబ్బగూడేం కాలనీలో మొక్కలు  పంపిణ చేసి  అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు.దాదాపుగ 400 మొక్కలను సంస్థ సభ్యులు ఇంటికి మూడు చొప్పున పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్,ఉపాధ్యక్షులు రాజశేఖర్,సభ్యులు సంజయ్,తిరుపతి,వెంకటేష్,విజయ్,రాజు,రవీందర్,రాజ్ కిరణ్,అజయ్,సతీష్, తదితరులు పాల్గొన్నారు.

విద్యా,వైద్యం,ఉపాధి హక్కులకై పోరాడుతాం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

విద్యా,వైద్యం,ఉపాధి హక్కులకై పోరాడుతాం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31;  విద్యా,వైద్యం,ఉపాధి హక్కులకై పోరాడుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలియజేశారు. సోమవారం రోజున ఏఐఎస్ఎఫ్, ఎఐవైఏఫ్ లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. అనంతరం రవీందర్,పూదరి సాయి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సమస్యలు విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగంలో మతపరమైన విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్యంశాలలో ప్రవేశపెట్టేందుకు సంస్కరణలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని, శాస్త్రీయ విద్యావిధానం ప్రవేశపెట్టాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ , ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో కన్యాకుమారి నుండి హుస్సెనీవాలా పంజాబ్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నమని ఈ లాంగ్ మార్చ్ ఆగస్టు 3వ తేదీన మంచిర్యాల జిల్లాకు వస్తుందని అన్నారు. దేశంలో దళిత, ముస్లిం,గిరిజనులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ప్రభుత్వ విద్యారంగంలో కామన్, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని, విద్యా వ్యాపారాన్ని , మత పరమైన మూఢ విశ్వాసాల విద్య విధానాలను , విదేశీ విశ్వవిద్యాలయాలను అరికట్టాలని, ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని, అందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి రోజ్ గారి గ్యారెంటీ యాక్ట్ ను అమలు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలని, కెజి టు పిజి ఉచిత విద్యను అమలు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, లౌకికవాదాన్ని పరిరక్షించాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, సమగ్ర వైద్య విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి సాయికుమార్,ధర్మ,కార్తీక్,మహేష్,శ్రీనివాస్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి

   ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31;ఎస్సి వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలని సోమవారం రోజున రెబ్బెన మండల తహశీల్దార్ బండారి రమేష్ గౌడ్ కు  వినతి పత్రం సమర్పించారుఈ  సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి గద్దల బానయ్య మాట్లాడుతూ ఎస్సిలలోని 59 ఉపకులాలకు సమన న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 23 సం/వత్సరాలనుండి జరుగుతున్న పోరాటాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు.అందుకు నిరసనగా నేటినుండి ఆగష్టు 07 వరకు రిలే దీక్షలు  కొనసాగుతాయన్నారు.ఈ కార్యక్రమం ప్రధాన డిమాండ్స్   ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రెవేశపెట్టాలి.తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీ కి పంపి పార్లమెంట్ లో  చట్టబద్దత కల్పించాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీల వర్గీకరణ పై అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీ కి పంపాలి.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులలో ఎస్ సి  ల ఏ  బి సీ  డి  వర్గీకరణ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలి.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి ప్రభాకర్,మండల ఇంచార్జి  అరికిళ్ల మొగిలి  నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 29 July 2017

బంగారు తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి

బంగారు తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 29;  తెలంగాణ రాష్ట్ర అవతరణ  ఎంతో మంది త్యాగఫలమని అందులో విద్యార్థులు కీలక పాత్ర పోషించి, ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని, నేటి విద్యార్థులు బంగారు  తెలంగాణకు సహకరించాలని ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. శనివారం తెరాస విద్యార్ధి సంగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమమును ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి  ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు   చేయలేని పనులను సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అన్నారు.ముఖ్యంగా  పేద విద్యార్థులకు ఉన్నత చదువుల ఆసరా కొరకు స్కాలర్షిప్ లు అందిస్తూ పైచదువులకై  ప్రోత్వహిస్తుంది అన్నారు. మన జిల్లా లో ప్రత్యక బాలబాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు అయ్యాయన్నారు. జిల్లా కేంద్రం ఆయన ఆసిఫాబాద్ లో మెరుగైన చదువు కోసం  డిగ్రీ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెబ్బెనలో నూతనగా ఏర్పాటు చేసిన కళాశాలకు కరెంట్, చుట్టూ ప్రరారీ గోడ,సిమెంట్ రోడ్, మౌలికా వసతుల కొరకు 6 లక్షల రూపాయలను కేటాయించి త్వరలోనే కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్బంగా సభ్యత్వం నమోదు చేసుకున్నారు. విద్యార్థులు సంఘాలుగా ఏర్పడి ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంజీవ్ కుమార్,  జెడ్ పి  టీ  సీ  బాబు రావు ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్  కుందారపు శంకరమ్మ ,రెబ్బెన సర్పంచ్  పెసర వెంకటమ్మ, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్,  టీ ఆర్ ఎస్ వి కొమురం భీం జిల్లా కోఆర్డినేటర్ మస్కు రమేశ్ , నాయకులు  కోవా సాయి,  శ్రీనివాసరావు. సోమశేఖర్, భరద్వాజ్, చిరంజీవి, రంగు మహేష్ ,  రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

లాంగ్ మార్చ్ గోడ ప్రతుల ఆవిష్కరణ

 లాంగ్ మార్చ్ గోడ ప్రతుల ఆవిష్కరణ    
                    


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 29;  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ అద్వర్యoలో  జిల్లా కేంద్రంలో   సేవ్ ఇండియా చేంజ్ ఇండియా పేరిట కన్యాకుమారి నుండి పంజాబ్ లోని ఉసెన్వాలి వరకు లాంగ్ మార్చ్ ఏ ఐ ఎస్ ఎఫ్ మరియు ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న లాంగ్ మార్బ్ గోడ ప్రతులను ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు విడుదల  చేసారు.ఈ సందర్భంగా ఏ ఐ ఎన్ ఎఫ్ అసిఫాబాద్ దివిజన్ అధ్యక్షలు బావునే వికాస్,కార్యదర్శి పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు పెరిగిపోతున్న సరైన ఉద్యోగా  అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని,తక్షణమే భగత్ సింగ్ జాతీయ ఉపాధి పథకం క్రింద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా దేశ వ్యాప్తంగా ఒకే విద్య విధానాన్ని అమలు చేయాలని, ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేసారు. అలాగే దేశ వ్యాప్తంగా దళితుల పైన,ముస్లిం మైనారిటీల మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పై సమస్యలు పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఈ నెల 15 వ తేదీన లాంగ్ మార్చ్ ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్రం లో ఆగస్టు 1వ తేదీన ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు పర్వతి సాయి,నాయకులు నామని హరీష్,సాయి కృష్ణ,తిరుపతి,నవీన్,తేజ,రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

గోలేటి అంగన్వాడి లో హరితహారం

 గోలేటి అంగన్వాడి లో హరితహారం  
                     
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 29;  మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు రెబ్బెన మండలంలోని గోలేటి భగత్ సింగ్ నగర్ లో  అంగన్వాడీ కేంద్రంలొ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమం లో అందరు పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు స్వర్ణలత, సంధ్య,మంజుల,భాగ్య లక్ష్మి,సుశీల,పిల్లల సంరక్షకులు పాల్గొన్నారు.

Thursday, 27 July 2017

పొలాల సరిహద్దులలో హరిత హారం

పొలాల సరిహద్దులలో హరిత హారం 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 27; పొలాల సరిహద్దులలో హరిత హారం కార్యక్రమని  గురువారం రెబ్బెనలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చర్మన్ కుందారపుసంకరమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తెలంగాణ ముఖ్యమంత్రిగారి ఆశయమైన హరిత తెలంగాణ  హరితహారం కార్యక్రమాన్ని ఎన్నోవిధాలుగా మొక్కలునాటి అవి వృక్షాలుగా పెంచితే సుసాధ్యం చేయవచ్చని   అన్నారు.  ఈ కార్యక్రమంలో లావుడ్య బిజ్జ బాయి  బోయిని  శంకరమ్మ   మిట్ట స్వరూప, ఎల్ లక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.

హమాలీల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం ; ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

హమాలీల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం; ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ 


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 27;  తెలంగాణ రాష్టంలో సుమారుగా 4వేల  మంది హమాలీలు ప్రతి రోజు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారని అలాగే వారికీ కనీస వేతనం అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు శ్రమ దోపిడీకి గురు చేస్తున్నాయని ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి  బోగే ఉపేందర్ అన్నారు. గురువారం రోజున ఏఐటియూసీ ఆధ్వర్యంలో చేపట్టిన హమాలీల సమ్మె 3వ రోజుకు చేరుకుంది వారి  సమస్యలను పరిష్కరించాలని కగజనగర్ రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిచి అనంతరం ఇంచార్జి అధికారి లింగమూర్తికి   వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రము లోని సుమారు  4 కోట్ల మంది ప్రజలకు నిత్యావసర వస్తువులను పేద బడుగు బలహీన ప్రజలకు అందించడంలో ప్రధాన పాత్ర హమాలీలు పోషిస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనను విరమిన్చుకోవాలని అలాగే హమాలీలని ప్రభుత్వ ఉద్యుగులుగా గుర్తిచాలని  కనీస వేత్తనం  30 వేలు ఇవ్వాలని, ఈ ఎస్ ఐ సౌకర్యం  బోనస్ పది వేలు చెల్లించాలని, 50 సంవత్సరాలు పై బడిన హమాలీలకు 3 వేల  పెన్షన్ ఇవ్వాలని ప్రతి హమాలీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్,3 ఎకరాల భూమి,ప్రతి సంవత్సరం రెండు జతల దుస్తులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హమాలీల సమస్యలలు పరిష్కరించాలని లేని పక్షం లో ఏఐటియూసీ ఆధ్వర్యంలో హమాలీల సమ్మెను మరింత ఉదృతం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమాంలో హమాలీలు, రాజు, కిషన్,సుధాకర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  

Wednesday, 26 July 2017

నంబాల స్కాలర్స్ పాఠశాలలో హరిత హరం

నంబాల స్కాలర్స్ పాఠశాలలో హరిత హరం 

 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 26 ;    తెలంగాణ ప్రభుత్వము  ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం  రెబ్బెన మండలం  నంబాల గ్రామం లోని స్కాలర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన  రెబ్బెన సబ్  ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ,నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల మాట్లాడుతూ హరిత హరం  కార్యక్రమాన్ని కేవలం మొక్కలు నాటడంతోనే సరికాదని వాటిని పెంచి వృక్షాలుగా అయ్యేటట్లు చూడాల్సిన భాద్యత తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఈ భాద్యత అప్పగిస్తే వారికీ మొక్కల సంరక్షణలో అవగాహన పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ భాను ప్రసాద్,స్కూల్ కరెస్పాండంట్ గట్టు రాము, హెడ్ మాస్టర్ కవిత మరియు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. 

Tuesday, 25 July 2017

హామీలకే పరిమితమైన తెరాస ప్రభుత్వం ; బిజె పి  జిల్లా  కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్


హామీలకే పరిమితమైన తెరాస ప్రభుత్వం ; బిజె పి  జిల్లా  కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 25;  తెలంగాణ పాలనలో ప్రభుత్వ హామీలు హామీలకే  పరిమితం అయ్యాయని   బిజెపి  జిల్లా  కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు  మంగళవారం రెబ్బెన మండలంలోని గోలేటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడురు. తెరాస  ప్రభుత్వ మూడు సంవత్సరాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని,అవినీతి పెరిగిందని అందుకు మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటివి ఉదాహరణ  అని ,అన్నారు. దళిత ముఖ్య మంత్రి హామీ ,దళితులకు 3 ఎకరాల భూమి,హామీలను మరిచి కుటుంబపాలన సాగిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెలలో 28వ తేదీన కాగజ్ నగర్ జరుగుతుందని కావున బీజేపీ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ప్రెసిడెంట్ కుందారపు బాలకృష్ణ,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శితో రస కొండా రాజు అమండాలా ప్రధాన కార్యదర్శి మల్రాజు రాంబాబు బి జె వై ఎం నాయకులూ జి శ్రావణ్ నానవేని సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఆంగన్ వాడీలకు శిక్షణ తరగతులు 

ఆంగన్ వాడీలకు   శిక్షణ తరగతులు 


 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 25;      పూర్వ ప్రాథమిక  విద్య పుస్తకంపై రెండవవిడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో అంగన్వాడీ కార్యకర్తల  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా  ఈఓ   కవిత , సి  డి పి  ఓ  రాజేశ్వరి,లు మాట్లాడుతూ ప్రతినెలా పిల్లలలో కలిగే అభివృద్ధిని గుర్తించి నోట్స్ రాసి జులై, డిసెంబర్, ఏప్రిల్ ,నెలల్లో పిల్లల అభివృద్ధి పుస్తకాలలో స్టార్ చుక్కలతో గుర్తించి వారి తల్లిదండ్రులతో ఈ సి సి ఈ  నందు చర్చించి పిల్లల సమగ్ర  మరియు సంపూర్ణ అభివృద్ధికై పాటుపడాలని చెప్పారు .  ఈ  కార్యక్రమం లో  అంగన్వాడీ సూపర్ వైజర్ లు  సుజాత, సరోజ తదితరులు పాల్గొన్నారు. 

Monday, 24 July 2017

కే ట్ ఆర్ జన్మదిన వేడుకలు

కే ట్ ఆర్ జన్మదిన వేడుకలు 

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24;     ఐ టి  శాఖా  మంత్రివర్యులు కే టీ  ఆర్  జన్మదిన సందర్భంగా రెబ్బెనలోని 5 వ వార్డ్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చర్మన్ కుందారపుసంకరమ్మ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ఎన్నోవిధాలుగా విజయవంతం చేయొచ్చని ప్రముఖుల  జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు మొక్కలునాటి అవి వృక్షాలుగా పెంచితే మన తెలంగాణ ముఖ్యమంత్రిగారి ఆశయమైన హరిత తెలంగాణ సుసాధ్యం చేయవచ్చని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎం విజయ,వ్ పద్మ,పి  రజిత, లక్ష్మి,రాధా,పోశమ్మ, విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.

ఇ – కాప్స్ పైన జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజుల శిక్షణ

 ఇ – కాప్స్ పైన  జిల్లా పోలీస్ సిబ్బందికి  వారం రోజుల శిక్షణ 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24;  సిసిటీఎన్ఎస్ “ ఇ – కాప్స్” పైన జిల్లా పోలీస్ సిబ్బందికి  వారం రోజుల పాటు  శిక్షణ తరగతుల కార్యాక్రమం చేపడుతున్నాటు కుమ్రం భీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీసులకు సోమవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.జిల్లా లోని పోలీస్ సిబ్బందికి  24.07.2017 నుంచి 31.07.2017 వరకు క్రిమినల్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం  లోని ఇ- కాప్స్ పైన వారం రోజుల శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు , ఈ శిక్షణ వల్ల జిల్లా పోలీసులు ,జిల్లా లో జరిగే  అన్ని నేరాల నమోదు నుంచి శిక్ష పడే వరకు జరిగే ప్రక్రియ అంతయు కంప్యూటరికరించబడి  ఆన్ లైన్ లొ నిక్షిప్తం అవుతుందని , శిక్షణ వల్ల జిల్లా సిబ్బంది  పని తీరు మెరుగు పడి , నాణ్యమైన సేవలు అందిచే విధంగా వుంటాయిని  తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమము లో జిల్లా ఐ టి కోర్ సిబ్బంది జే .శ్రీనివాస్, యం. శ్రీనివాస్, సపోర్టింగ్ సిబ్బంది పి. రమేష్ , మాణిక్ రావు , మణి, మరియు జిల్లా పోలీస్ స్టేషన్ ల యొక్క రైటర్ లు  పాల్గొన్నారు.

రేషన్ డీలర్ ల సమ్మె ను విజయవంతం చెయ్యండి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్

 రేషన్ డీలర్ ల సమ్మె ను విజయవంతం చెయ్యండి            ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్    
               
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24;  తెలంగాణ  రాష్ట్రంలో రేషన్ డీలర్ లు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించి వారికి  ప్రతి నెల గౌరవ వేతనం ఇరవై  వెయ్యిలు  ఇవ్వాలని ఏఐటీయూసి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేసారు.సోమవారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు శాఖ అతిధి గృహంలో రేషన్ డీలర్ లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేఖరులను ఉద్దేశించి మాట్లాడారు.అదే విధంగా జూలై నెల 1వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ లు సమ్మెకు సిద్ధం అవుతున్నారని,ఈ సమ్మెలో జిల్లాలోని రేషన్ డీలర్ లు అందరు పాల్గొని సమ్మెను విజయవంతం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య,రేషన్ డీలర్ సంఘం మండల అధ్యక్షులు ఎస్.రామయ్య,రేషన్ డీలర్ లు గాజుల బాపు,శంకర్,మురళి, సంతోష్ ,శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.

Saturday, 22 July 2017

విద్యార్థులకు పోలింగ్ పై అవగాహణ

విద్యార్థులకు పోలింగ్ పై అవగాహణ 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22;   విద్యార్థులకు పోలింగ్ విధానం పైన అవగాహణ  పెంచేందుకు రెబ్బెన మండలం లేతనగూడ గ్రామంలో  ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రవికుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రజలు పొందిన అతి గొప్ప హక్కు ఓటు హక్కు అని అన్నారు.పాఠశాలలో వివిధ కమిటీలను ఎన్నుకోవడానికి విద్యార్థులకు మధ్య ఎన్నికలు నిర్వహించారు.కాగా పాఠశాల ప్రధానమంత్రిగా 5వ తరగతికి చెందిన కె.మహేష్ ను విద్యార్థులు ఎన్నుకున్నారు.అదే విధానంగా ఆహార,పరిశుభ్రత,క్రమశిక్షణ కమిటీలకు మంత్రులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జె.కవిత,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు తిరుపతమ్మ,విద్యార్థులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ గ్రామా కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ గ్రామా కమిటీ ఎన్నిక  
  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22; ఎస్పీ వర్గీకరణే ద్యేయంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేయడానికి గ్రామా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని ఆ సంఘం జిల్లా ఇంచార్జి గద్దల బానయ్య అన్నారు.కాగా గంగాపూర్ గ్రామా కమిటీ అధ్యక్షునిగా ఇగురపు రమేష్ నుఎన్నుకోగా,ఉపాధ్యక్షుడిగా ఆశయ్యను,గౌరవ అధ్యక్షుడిగా రాజయ్యను,వర్కింగ్ అధ్యక్షునిగా బాపును,ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ను,కార్యదర్శిగా మల్యాల వినోద్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులూ ప్రశాంత్,అరికిళ్ల వెంకటేష్,శశికుమార్,అనిల్ లు పాల్గొన్నారు. 

సి.సి.టి.ఏన్.స్ లో ప్రతిభ కనబరచిన వారికీ ప్రోత్సహకాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్.


సి.సి.టి.ఏన్.స్ లో ప్రతిభ కనబరచిన వారికీ ప్రోత్సహకాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22;  జిల్లా లో సాంకేతికతను  అందిపుచ్చుకొని ప్రతిభ కనబరిచిన వారికీ  నెల ,నెల   ప్రోత్సాహకాలు అందించి   వారిని ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు, సి.సి.టి.ఏన్.స్ జిల్లాలో ప్రవేశ పెట్టిన అప్పటినుంచి , ఇప్పటి వరకు, సి.సి.టి.ఏన్.స్ నమోదు,వినియోగం మరియు  సి.సి.టి.ఏన్.స్ యొక్క ప్రగతి ను జిల్లా ఎస్పి పర్యవేక్షించారు, అందులో బాగముగా కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి  ప్రతిభ కనబరిచిన  పీ.సి- 3267  బాల్ని రవి కుమార్ ను జిల్లా ఎస్పి ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకము ను అందించి అబినంధించారు .జిల్లాలో ఆధునిక  సాంకేతికతను అందుబాటులో తిసుకువస్తున్నామని దానికి అనుగుణముగా జిల్లా సిబ్బంది కు ప్రత్యెక శిక్షణ తరగతులను త్వరలోనే ప్రారంబిస్తామని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమము లో జిల్లా ఐ.టి కోర్ సిబ్బంది జే. శ్రీనివాస్, మాణిక్  రావు ,రమేష్ , శ్రీనివాస్ ,పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్య కాంత్ , యం.డి.ఇంతియాజ్, పాస్ పోర్ట్ కార్యాలయ అధికారి మురళి , ఫింగర్ ప్రింట్  విబాగము అధికారులు ఏ. తిరుపతి ,   జటోత్ శ్రీనివాస్ మరియు జిల్లా లోని ఎసై లు సిఐలు పాల్గొన్నారు.

ట్ఆర్ఎస్వీ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియామకం

  ట్ఆర్ఎస్వీ నూతన   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియామకం 




ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22;  తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగానికి నూతనంగా నియమితులైన  ట్ఆర్ఎస్వీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడా సతీష్ మరియు కొమురం భీం జిల్లా కోఆర్డినేటర్ మస్కు రమేశ్ లను  శుక్రవారం నాడు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉదేసించి వారు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కలిపిo చిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి రాష్ట్ర అధ్య క్షులు గేళూ శ్రీనివాస్ గారికి ఎం ఎల్ ఏ  కోవ లక్ష్మి గారికి ఎం ఎల్ సి పురాణం సతీష్ గారికి దన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమ లో శ్రీనివాస్ రావు, సదాశివ, శంకరమ్ము, రవి నాయక్, నరేందర్, పార్వతి అశోక్ ,రామ్ రెడ్డి, రంజిత్, ఆత్మరావునాయక్ పాల్గొన్నారు

Friday, 21 July 2017

పోలీసు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తేనే లక్ష్యం ను చేరగలము – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

     పోలీసు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తేనే  లక్ష్యం ను చేరగలము – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21;  జిల్లాపోలీసులు అన్ని కార్యక్రమలలో ముందువుండి మార్గదర్శకం చేస్తేనే మన నియమిత లక్ష్యం ను చేరగలము అని జిల్లా సన్ ప్రీత్ సింగ్ తెలిపారు శుక్రవారం జిల్లాలోని స్థానిక పోలీసు కాన్ఫరెన్స్  హాల్  లో నెల వారి నేర సమీక్షా సమావేశం ను జిల్లా లోని పోలీసు సిబ్బంది తో నిర్వహించారు. ఈ  నేర సమీక్షాసమావేశం లో జిల్లా శాంతి భద్రత లకు తిసుకోవలిసిన చర్యలను  జిల్లా ఎస్పి జిల్లా పోలీసులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రము లో పోలీసులు గురుతర బాద్యత ను పోషించాలి అని మొక్కలు నాటడం మాత్రమె కాకుండా వాటిని సంరక్షించే బాద్యత కూడా ముఖ్యం అని జిల్లా ఎస్పి తెలిపారు హరిత హారం లో విద్యార్థులను బాగాస్వాములను చేసి వారి అబిరుచి కు తగినట్లు  మొక్కలు స్వయముగా ఎంచుకొని వాటిని సరఫరా అయ్యేలా చూడాలని ,హరిత హారం పైన రోజు వారి  గా స్టేషన్ , సర్కిల్ , సబ్ డివిజన్  ల వారిగా సమీక్షా నిర్వహించాలి అని తెలిపారు , నేర సమీక్షాసమావేశం లో జిల్లా లో ఆహార కల్తి , హోటల్స్ లలో కల్తి చేసేవారిని గుట్కా, నిషేదిత పాన్ మసాలా లను విక్రయించేవారిని ఉక్కు పాదం తో అణచివేయాలని అధికారులను ఆదేశించారు, మరియు అనుమానం కలిగిన ఆహార పదార్థాలను శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ లాబ్ కు పంపాలని ఆదేశించారు, అంతేకాక జిల్లా లో నూతనముగా ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ AFIS, క్లూస్ టీం లను వాడుకొని కేసు లను త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు , జిల్లా లో  ఒంటరి మహిళ లను ,గ్రామీణ  ప్రాంత యువతులను మోసం చేసే వారి పట్ల  కటినం గా వ్యవహరించాలని , వెనుకబడిన గిరిజన గ్రామాలలో విద్యపైన సంపూర్ణ అవగాహన లేక గ్రామాలు ,తండా లలో  విద్యార్థులు ,లాంగ్ అబ్సెంట్, డ్రాప్ పుట్ లు ఎక్కువగా అవుతున్నారని  అటువంటి విద్యార్థుల సమాచారం ను సేకరించి వారికీ, వారి తల్లిదండ్రులకు విద్య యొక్క ప్రాదాన్యం ను వివరిoచాలి  అని ,లేక వారు ఏది అయిన సమస్యను ఎదుర్కొన్నట్లఅయితే అది తన ద్రుష్టి కు తీసుకురావాలని తెలిపారు. జిల్లా లోని రాష్ట్ర సరిహద్దుల  వెంబడి  వున్న గ్రామ యువత పైన ప్రత్యెక ద్రుష్టి  వుంచి వారి సంక్షేమమునకు గ్రామ సభలను నిర్వహించి పోలీసులు మీకోసం అనే భావన వారిలో  వచ్చేలా చైతన్యం తీసుకురావాలని తెలిపారు , జిల్లా లోని మారుమూల ప్రాంతాల లో కులం పెరు తో గ్రామ బహిష్కరణలు విదించే వారిపట్ల కటినం గా వ్యవహరించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు , ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ , జిల్లా సి ఐ లు , ఎసై లు, , డిసిఆర్బి ఎసై రాణాప్రతాప్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ , సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , పోలీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్,  MD.ఇంతియాజ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్, పాస్ పోర్ట్ అధికారి మురళి, క్యాంప్ కార్యాలయ సిబ్బంది కిరణ్, మరియు వామన్ లు మరియు పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

బెల్లంపెల్లి ఏరియా లో కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్ ఆవుల గోవర్ధన్ పర్యటన

 బెల్లంపెల్లి ఏరియా లో కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్  ఆవుల గోవర్ధన్ పర్యటన 




  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21;  రెబ్బన మండలం లోని గోలేటి బెల్లంపెల్లి ఏరియా లో శుక్రవారం జాతీయ కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్  ఆవుల గోవర్ధన్ పర్యటించారు . ఈ పర్యటన లో భాగంగా సివిల్ డిపార్ట్మెంట్ యందు ఖైర్గుడా యందు మరియు బీపీ ఏ ఓసీ 2 లోని ఒప్పంద ఉద్యోగులను కలిసి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు ,అనంతరం  జీఎం గారి కార్యాలయం లో బెల్లంపల్లి ఏరియా జీఎం కే రవిశంకర్ గారితో సమావేశం ఐ బెల్లంపెల్లి ఏరియా కాంట్రాక్టు కార్మికుల సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలను జీఎం గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరారు ఈ సమస్యల పట్ల జీఎం రవిశంకర్ గారు సమకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలిసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది తదనంతరం బీపీ ఏ ఏరియా విచ్చేసిన ఆవుల గోవర్ధన్ గారికి బీపీ ఏ జీఎం రవిశంకర్ వారిని పులా మల మరియు శాలువాతో సన్మానించారు.   ఈ విషయం ఫై కాంట్రాక్టు కార్మికుల సంక్షేమాన్ని చూస్తున్న జీఎం రవిశంకర్  గారికి గోవర్ధన్ గారు అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు.   బెల్లంపెల్లి ఏరియా లో కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్  ఆవుల గోవర్ధన్ పర్యటన విచ్చేసిన వారికీ బీజేపీ జిల్లా అధ్యక్షులు జే పి పొడేల్  గౌరంగా ఆహ్వానించారు.   కార్మికులు, నాయకులు పలు సమస్యలపై చర్చ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆవుల గోవర్ధన్ మాట్లాడుతు ఈ నెల  25న  బొగ్గు గని కార్మిక మంత్రులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిస్తాం అని  అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ  మోహన్ రెడ్డి డిజిఎం పర్సునల్ జె చిత్తరంజన్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్, డి వై పి ఎం రామశాస్రి, కార్యదర్శి పులిరాజారెడ్డి,పి  గట్టయ్య, సంజీవ్ యాదవ్, డి లక్ష్మి నారాయణ, కె శంకర్, తిఆరుపతి, ఉపేందర్, బ్రమ్మానందం, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.  

విద్యా సంస్థల బంద్ విజయవంతం

విద్యా  సంస్థల బంద్ విజయవంతం 
  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21;  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)మరియు వామపక్ష విద్యార్ధి సంఘాలు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా  తలపెట్టిన ప్రభుత్వ,ప్రైవేట్ విద్య సంస్థల బంద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  వివిధ మండలాలతోపాటు రెబ్బన మండలంలో కూడా  విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలిపారు.కొన్ని పాఠశాలలు స్వచ్చందంగా బంద్ పాటించగా కొన్ని పాఠశాలలకు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,మండల నాయకులూ జాడి సాయి,నాయకులూ  వెళ్లి విద్యార్థులను బయటికి పంపించి బంద్ చేశారు.కాగా మండలంలోని నడుస్తున్న కొన్ని  పాఠశాలలకు   వెళ్లి పాఠశాలల బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగా దుర్గం రవీందర్,పూదరి సాయికిరణ్ లు  మాట్లాడుతు ప్రభుత్వ విద్య సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కకరించాలని,వసతి గృహాల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా  సంవత్సరం నుండే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.నూతనంగా ఏర్పడిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు,ఐటిఐ,పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసి పేద,గిరిజన విద్యార్థులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మహిపాల్,రవి,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 20 July 2017

మన ఒత్తిడి యె మన ప్రథమ శత్రువు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

మన ఒత్తిడి యె మన ప్రథమ శత్రువు  - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్.
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ;   మన యొక్క మానసిక ఒత్తిడి వల్లనే అనారోగ్యనికి గురిఅవుతాము అని ,దానిని జయించవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గారు తెలిపారు, గురువారం కుమ్రం భీమ్ జిల్లా స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో హైదరబాదు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సౌజన్యం తో మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు , పోలీసు సిబ్బంది కు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితముగా ఆర్తో,గైనకాలజిస్టు,కార్డీయాలజీ ,జనరల్ ఫిజీసియన్స్ ,తో అధునాతనమైన 2 డి ఏకో, ఈ.సి.జి, బొన్ డెన్సిటీ టెస్ట్, కార్డీగృఫీ వంటి పరికరాలతో పరీక్షించారు, యశోద హాస్పిటల్ డాక్టర్లు,నగుర్,కిరణ్, అధిల్, ప్రీతి లు  యశోద హాస్పిటల్ మేనేజర్ విజయసారథి లతో పాటు యశోద హాస్పిటల్ యొక్క  రెండు ప్రత్యేక వాహనములు మెడికల్ క్యాంప్ నిమిత్తము ఆసిఫాబాద్ వచ్చాయి .ఈ కార్యక్రమము లో యశోద హాస్పిటల్ సిబ్బంది మరియు హెడ్ క్వార్టర్ ఆర్ఎస్సై లు  వామనమూర్తి, శేఖర్, అనిల్ కుమార్ MTO శ్రీనివాస్, ARSI శ్రీరాములు, ఎస్పీ సి.సి శ్రీనివాస్, ఎస్బీ ఏసై లు శివకుమార్, శ్యామ్ సుందర్,పోలీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్, ఇంతియాజ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహళద్, పాస్ పోర్ట్ అధికారి మురళి,క్యాంప్ కార్యాలయ సిబ్బంది కిరణ్, మరియు వామన్ లు పాల్గొన్నారు.



రైతు కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ; సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్

రైతు కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ;
 సిపిఐ రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్ 

 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను గాలికి వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని  సిపిఐ రాష్ట్ర   కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలు  పరిష్కరించాలని అఖిల భారత రైతు సంఘం చేపట్టిన జీపు జాతా రెబ్బెన చేరుకున్న సందర్భంగా దానికి స్వాగతం సిపిఐ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గుండ మల్లేష్ మాట్లాడుతు పంటలకు  గిట్టుబాటు ధరలను సకాలంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని,ఎస్సీ,ఎస్టీలకు మూడు ఎకరాల భూపంపిణీ చెయ్యాలని,రెండు పడకల ఇండ్లని నిర్మిస్తామని ఇప్పటికి ఒక్క గది ఇండ్ల నిర్మాణం చేపట్టక పోగా  ముఖ్యమంత్రి వాటి సంగతే మరిచిపోయారని,కుటుంబ పాలనతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేసీఆర్  మిషన్ కాకతీయ,మిషన్ భగీరధాలలో జరుగుతున్నా అవినీతి గురించి బహిరంగ చర్చకు రావాలని బహిరంగా సవాలు చేశారు.కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో చంద్రశేఖర్రావుల పాలనా ఊరుకో కోడి,ఇంటికో ఈక అన్న చందంగా మారిందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతులకు సకాలంలో పంట రుణాలు మంజూరు చెయ్యాలని,పహాణి నఖలు,బ్యాంకర్లు నుండి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ రైతులకు,కార్యకర్తలకు,ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుపు ప్రభాకర్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమంలో జిల్లాపాలనాధికారి

 హరితహారం  కార్యక్రమంలో జిల్లాపాలనాధికారి

   ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ;  మూడో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగ గురువారం   జిల్లా పాలనాధికారి  చంపాలాల్ రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ విద్యార్ధినులు కేజీబీవీలో నాటిన మొక్కలను సంరక్షించాలని,నాటిన మొక్కలకు నిరంతరం నీళ్లు పోస్తూ వాటిని కుటుంబంలోని సభ్యుల్లా కాపాడాలని అన్నారు.వసతి గృహంలోని విద్యార్థినులకు దుప్పట్లు పంపిణిచేసారు. శ్రద్దగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమం హరితహారంలో పాల్గొని   ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే  అవి రేపటికి వృక్షాలు అవుతాయని,వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు.మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణ గ  మారుతుందని అన్నారు. శ్రద్దగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి  ట్ సి  బాబురావు,ఎం పి  పి  సంజీవ్ కుమార్,ఎం పి  డ్ ఓ సత్యనారాయణసింగ్  గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్ తహసీల్దార్  రమేష్ గౌడ్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిట వైస్ చైర్మన్ శంకరమ్మ తెరాస మండల అధ్యక్షుడు పోతూ శ్రీధర్ రెడ్డి మరియు  మండలం లోని సర్పంచులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 19 July 2017

తలసిమియా – సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు సమిష్టి సహకారo అందించటం ఎంతో అవసరం – ఎస్పి సన్ ప్రీత్ సింగ

తలసిమియా – సికిల్ సెల్  వ్యాధిగ్రస్తులకు  సమిష్టి  సహకారo అందించటం ఎంతో అవసరం – ఎస్పి సన్ ప్రీత్ సింగ

  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19; తలసిమియా వ్యాధి గ్రస్తులను మానవత దృక్పథం, సమిష్టి సహకారం తోనే ఆదుకోగాలమని కుమ్రంభీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.జన్యుపరంగా ,వారసత్వ పరంగా హిమోగ్లోబిన్ లోపాలు వంటి బహుముఖ వైద్య సమస్యలను వీరు కలిగి ఉంటారని , తలసిమియా వ్యాధి గ్రస్తుల సంరక్షణ మెరుగు పరుచుటకు  ప్రారంభయత్నాలు ఇంకా అబివృద్ది దశలోనే వున్నాయని , అవి పూర్తి స్థాయి లొ అందుబాటులో లేనందున వారి అవసర నిమిత్తం ప్రాణాపాయ స్థితి లో వుండే పిల్లలను ఆదుకునేందుకు మానవీయ కోణం లొ మనం అందరం రక్తదాన శిబిరాలలో రక్తదానo చేయలిసిన అవసరం ఎంతైనా వున్నదని తెలిపారు. ఎక్కువగా తలసిమియా బాధితులు  మంచిర్యాల్ , కుమ్రంభీం జిల్లా లో చిన్న వయస్సు అయిన 1 సం. నుంచి 35 సo. ల వారు ఎక్కువగా వున్నారని వారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించుటకు రక్త మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని  రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు , అభినవ యూత్ సభ్యులు తెలిపారు, ఈ సందర్బముగా జిల్లా లో తలసిమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలను నెలకొల్పాలని జిల్లా ఎస్పి గార్కి వినతి పత్రంను అందచేశారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ , సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , రెడ్ క్రాస్ సొసైటీ కో-ఆర్డినేటర్ సంతోష్ , తలసిమియా –సికిల్ సెల్ కో- ఆర్డినేటర్ కాసర్ల శ్రీనివాస్ మరియుపిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్



విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19; ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున రెబ్బెనలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు. గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని,కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టలని, అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పాలిటెక్నిక్ కళాశాల,ఐటీఐ కళాశాల మంజూరు చేయాలని ఈ బంద్ నిర్వహిస్తున్నమని అన్నారు.

విద్యార్థులకు శాపంగా మారిన రోడ్లు

విద్యార్థులకు శాపంగా మారిన రోడ్లు 

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19;   రెబ్బెన మండల కేంద్రములో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ మురదమయము కావడముతో విద్యార్థులకు శాపంగా మారాయి .  3 సంవత్సరాల  కాలంగా పాలకులు,  ప్రభుత్వ అధికారులు , మండల ప్రజా ప్రతినిధులు ఎన్నో హామీలు ఇచ్చారు . మర్చిపోతున్నారు . వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రైతులకు  , అంగన్వాడీ విద్యార్థులకు , ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈసబ్  స్టేషన్ రోడ్ ఎంతో ముఖ్యం ఈ రోడ్ గుండా ప్రతి రోజు ప్రజలు నడుస్తూ వుంటారు . ఇప్పటికైనా విద్యార్థుల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకొని రోడ్ బాగు చేయించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు . 
తొగిటి లక్ష్మణ్ - పేరెంట్ 

బురదలో ప్రతి రోజు పిల్లలను తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , గతములో రోడ్ వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు,అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

Tuesday, 18 July 2017

రెబ్బెన 5 వ వార్డులో హరిత హరము

రెబ్బెన 5 వ వార్డులో హరిత హరము  
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18;  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా 5 వ వార్డులో     రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ఆసిఫాడ్ మార్కెట్  వైస్ ప్రెసిడెంట్ శంకరమ్మ, నవీన్ కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమంలో పాల్గొని   ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే  అవి రేపటికి వృక్షాలు అవుతాయని, సమస్త మానవాళికి ప్రాణాధారమైన స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో, అరుణ, సుగుణ,మధునమ్మ,పార్వతి, అనిత ,  తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమమే సింగరేణి సంస్థ లక్ష్యం


కార్మికుల సంక్షేమమే సింగరేణి సంస్థ లక్ష్యం 


ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18;   సింగరేణి ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని డైరెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా లోని గోలేటిలో 80 లక్షలతో నూతనంగా  నిర్మించిన స్విమ్మింగ్ పూల్  ప్రారంభించి  మాట్లాడారు. కార్మికుల మానసిక శారీరక వికాసానికి దోహదపడే కార్యక్రమాలలో భాగంగా ఈ స్విమ్మింగ్ పూల్  నిర్మించడం జరిగిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నదని కూడా తెలిపారు విద్యాభిరుద్ది,రవాణా సదుపాయంకోసం రోడ్డు డివైడెర్ఫ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు  ఏ కార్యక్రమంలో జి ఎం రవిశంకర్, డ్ జి ఎం పర్సనల్ చిత్తరంజన్ ,డ్ వై పి  ఎం రామశాస్ట్రీ,సుదర్శన్ సివిల్ డ్ జి ఎం ప్రసాదరావు ,కార్మిక నాయకులూ ఎస్ తిరుపతి,సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్ ఆశ్రమపాఠశాలలో ప్రవేశాలు


 ఆసిఫాబాద్ ఆశ్రమపాఠశాలలో ప్రవేశాలు  

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; తెలంగాణ ఆదర్శ పాఠశాల,ఆసిఫాబాద్ నందు 2017.1 8విద్యాసంవత్సరానికి 6వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశం కొరకు రెండవ విడత జాబితా పాఠశాలలో అందుబాటులో ఉంచినట్లు, .ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22 వ తేదీలోపు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రా లతో పాథశాల కార్యాలయంనందు సంప్రదించవలెను అని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.  

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్



ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యా పరిరక్షించాలని ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు.అనంతరం దుర్గం రవీందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు తెలుసుకోవాడానికి జిల్లా వ్యాప్తంగా సైకిల్ జాత నిర్వహించమని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని, సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి, డివిజన్ కార్యదర్శి పుదారి సాయి కిరణ్, మండల కార్యదర్శి ప్రణయ్, నాయకులు మహిపాల్, సంజయ్,శ్రావణ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

21న విద్యాసంస్థల బంద్ ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

21న విద్యాసంస్థల బంద్ ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు



ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన  విద్యాసంస్థల బంద్ కు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గోడ ప్రతులను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు..అనంతరం ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగోర్ల చంద్రశేఖర్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని,కెజి టూ పిజి ఉచిత విద్యాను అందించాలని,కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని తదితర విద్యారంగ సమస్యలపై నిర్వహించే బంద్ లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ప్రణయ్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Monday, 17 July 2017

కార్మిక సంఘాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

కార్మిక సంఘాలపై   తప్పుడు ప్రచారం మానుకోవాలి 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 16;       కార్మికసంఘాలపై తప్పుడుప్రచారం మానుకోవాలని  సి ఐ టి  యూ రాష్ట్ర కార్యదర్శి ఒంగురి రాములు   జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకే ష్ ,జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాసులు  అన్నారు సోమవారం నాడు ఆసిఫాబాద్ జిల్లాకేంద్రం లో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.   కార్మిక చట్టం 1926 ప్రకారం కార్మిక సంఘాలు తమ సభ్యులనుండి సభ్యత్వ రుసుము వసూలుచేసుకోవచ్చని ఈ విషయంపై కనీస అవగాహనా లేకుండా ఎం ల సి  పురాణం సతీష్  కార్మిక సభ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం భావ్యం కాదని తెలిపారు. కార్మిక సంఘం లేని ట్ ర్ఎస్ వాళ్ళు అంగన్వాడీ ఆశ  వర్కర్లు, డబల్ బెదురూమ్ పధకమనిచెప్పి 100,200,రూపాయలను బలవంతంగా వాసులు చేస్తూ కార్మికసంఘాలపై బురద జల్లడం మానుకోవాలని ఎం ఎల్ సి  పురాణం సతీష్  ను సి ఐ ట్ యూహెచ్చరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ ట్ యూ  రాష్ట్ర నాయకులూ డ్ మల్లేష్,జిల్లానాయకులు ఆనంద్ కుమార్,సంజీవ్,మూరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ కమిటీల నియామకం

  విశ్వబ్రాహ్మణ  సంఘం  గ్రామ కమిటీల నియామకం



ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 16;  విశ్వబ్రాహ్మణ  సంఘం  గ్రామ కమిటీల నియామక  కార్యక్రమాన్ని సోమవారంనాడు రెబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో జిల్లా కన్వినర్ లక్ష్మణాచారి ఆధ్వర్యంలో గ్రామకమిటీల నియామకం జరిగిందని తెలిపారు నంబాల గ్రామధ్యక్షులుగా చొక్కాల రమెశ్చారి,నార్లాపూర్ గ్రామధ్యక్షులుగా రంగు సూర్యనారాయణాచారి,కృష్టాపూర్ గ్రామధ్యక్షులుగా పాలకుర్తి వెంకటయ్యచారిలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రవిందరాచారి,తంగెళ్లపల్లి శ్రీనివాసాచారి తదితరులుపాల్గొన్నారు 

Saturday, 15 July 2017

కలెక్టరేట్ ముట్టడికి తరలిరం డి ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

 కలెక్టరేట్ ముట్టడికి తరలిరం డి ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ;    విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 19వ తేదీన తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి రావాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు సాయి అధ్యక్షతన జరిగిన రౌండ్ టెబుల్ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగోర్ల చంద్రశేఖర్,పి.డి.యస్.యు. జిల్లా ఇంచార్జ్ పాపారావు,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని,కెజి టూ పిజి ఉచిత విద్యాను అందించాలని,కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని తదితర విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదరి సాయికిరణ్ ప్రణయ్,భీమేష్,తదితరులు పాల్గొన్నారు.

విద్య ,వైద్యం,ఉపాధి హక్కులకై లాంగ్ మార్చ్ ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

విద్య ,వైద్యం,ఉపాధి హక్కులకై లాంగ్ మార్చ్ ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ;   విద్యా,వైద్యం,ఉపాధి హక్కుల సాధనకై దేశ వ్యాప్తంగా ఎఐఎస్ఏఫ్ ,ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ బస్సు యాత్రకు మద్దతుగా రెబ్బెన మండల కేంద్రంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ జెండా ఆవిష్కరించారు.అనంతరం రవీందర్ మాట్లాడుతూ దేశంలో దళితులపై,ఆదివాసులపై,గిరిజనులపై,మైనార్టిలపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు,ముస్లింలకు,గిరిజనులకు రక్షణ కరువైందని అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు,యువకులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నరాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న దాడులను అరికట్టలని ,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,దేశ వ్యాప్తంగా కామన్ విద్యా విధానం ప్రవేశ పెట్టాలని,నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల కార్యదర్శి మహిపాల్,జిల్లా సమితి సభ్యులు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కుల పంపిణి

కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు  చెక్కుల పంపిణి 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ;     తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పెళ్లిళ్ల కోసం ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి  పధకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు శనివారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్,స్థానిక శాసనసభ సభ్యురాలు కోవా లక్ష్మి  పాల్గొని చెక్కులను పంపిణి చేసారు.ఈ సందర్బంగా అర్హులైన 27 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేశారు.ఎంపీపీ కర్నాథం సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  మండలి సభ్యులు పురాణం సతీష్,శాశన సభ్యురాలు లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పెళ్లిళ్ల ఆసార కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముభారక్ వంటి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరూరా తిరిగి పేద ప్రజల బాధలను తెలుసుకొని,ఇప్పుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ  అమలు పరుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను ఇప్పుడు తెలంగాణ  ప్రభుత్వం చేసి చూపుతుందని అన్నారు. గత ప్రభుత్వాలలో 200 రూపాయలు ఉన్నా పింఛన్లు ఇప్పుడు వితంతువులు,వృద్ధులకు 1000 మరియు వికలాంగులకు 1500 గ పెంచిన ఘనత కేసిఆర్ కె దక్కిందని అన్నారు. రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా చేసి ఆసిఫాబాద్ అభివృద్ధి కోసం కొమురంభీమ్ జిల్లా గ ముఖ్యమంత్రి ప్రకటించాటం వాళ్ళ కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి ప్రారంభం అయిందని  అన్నారు. హరిత హరంలో అందరూ పాల్గొని విజయవంతం చేసి వాటిని సంరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలదే అని అన్నారు. మొక్కలను నాటి పెంచి,సంరక్షించే గ్రామాలను ఉత్తమ  గ్రామాలుగా ప్రకటించి నగదు  బహుమతులు 8,00,000 నుండి 10,00,000  అందిస్తామని అన్నారు.అదే విధంగా గోలేటిలోని కైరిగూడ వాగు వంతెన కోసం కోటి యాబై లక్షలు మొతంగా మూడు కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే నిధుల నుండి విడుదల చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని గ్రామాల రోడ్ల అభివృద్ధి కోసం  కోటి యాబై లక్షలు ఖర్చుతో అభివృద్ధి చేయటం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ కానక యాదవరావు, జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ భగవంతరావు,రెబ్బెన  జిల్లా ప్రాదేశిక సభ్యులు అజ్మీర బాబురావు,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,యంపిడిఓ సత్యనారాయణ,రెబెనా సిఐ మదన్లాల్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,మండలంలోని సర్పంచులు రవీందర్,వెంకటేశ్వర్లు,లక్ష్మణ్, ఎంపిటిసి సభ్యులు కొవ్వూరి శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.