విద్యార్థులు క్రీడల పై అసక్తిని పెంచుకోవాలి ; ఎంపీపీ సంజీవ్ కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 02 ; (వుదయం ప్రతినిధి) ; విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పై ఆసక్తిని పెంచుకోవాలని రెబ్బేన మండల ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్,జడ్పీటీసీ అజ్మేరా బాబూరావులు అన్నారు.మంగళవారం రోజున రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ముదిగిరి రమేష్ స్మారక కబడ్డీ పోటీలు అండర్ 16 పోటీలకు,నిర్వాహకుడు పూదరి సాయికిరణ్ అధ్యక్షన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.ఈ సందర్బంగా స్వర్గీయ రమేష్ స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్న అతని స్నేహితులను అభినందించారు.క్రీడలలో గెలుపోటములు సహజమని,స్నేహభావంతో ఆటలు ఆడాలని అన్నారు.స్వర్గీయ రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని,అతని కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.ఈ సందర్బంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.అనంతరం వారు కబడ్డీ పోటీలను ప్రారంభించారు.తొలుత గోలేటి సాయిరాం జట్టు,తాండూరు యంగ్ బాయ్స్ తలపడగా గోలేటి సాయిరాం జట్టు విజేయ కేతనం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,నాయకులూ,నిర్వాకులు కుందారపు నరేష్,అరికెల్ల మొగిలి,జాడి సాయి,తిరుపతి,పోతురాజుల శ్రీకాంత్,జేటంగుల సంజయ్,గడ్డం వంశీ,పవన్,అజయ్,రాకేష్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment