ఎండకు వెళితే జాగ్రత్తలు అవసరం - తహసిల్దార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 19 ; (వుదయం ప్రతినిధి) ; ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున తప్పకుండ ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని రెబ్బెన తహసిల్దార్ బి రమేష్ గౌడ్ అన్నారు .శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఉష్ణోగ్రతలు తీవ్రత అధికంగా ఉందని , ఎండకు వెళితే త్రాగు నీరు తప్పని సరి వెంట తీసుకెళ్లాలని , గొడుగు లేదా తలకు గుడ్డను కట్టు కోవాలని అన్నారు . అదే విధంగా పిల్లలు , వృద్దులు ఎండకు బయటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు . ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు . ఎవై న పనులు ఉంటె 10 గంటల లోపే ముగించుకొని సాయంత్రము 5 గంటల తరువాతే బయటకు వెళ్లాలని అన్నారు.
No comments:
Post a Comment