అంకితబావంతో పని చేస్తేనే సమాజంలొ గుర్తింపు- ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ; పోలీసులు విది నిర్వహణలో అంకిత బావం , సేవా తత్పరతలతో శాంతి భద్రతలను పరిరక్షించాలని ,జిల్లా పోలీసులు అన్నిటా ఆదర్శంగా, మార్గనిర్దేశకులుగా నిలవాలని అందుకు జిల్లా అధికారుల నుంచి ఎల్ల వేళల సహాయ సహకారాలు అందిస్తాము అని కుమరం భీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం` ఆసిఫాబాద్ జిల్లాలొ ఎఆర్ ఎసై గా పనిచెస్తూ ఆర్ఎస్సై గా ప్రమోషన్ పొందిన నజార్ హుస్సేన్ ను జిల్లా ఎస్పి గౌరవచిహ్నం, పదోన్నతి చిహ్నం ను అలంకరించి శాలువ తో సత్కరించి అబినందిచారు.ఇక పైన కూడా రెట్టింపు ఆత్మ విశ్వాసం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీ ఐ వెంకటేశ్వరులు, స్పెషల్ బ్రాంచ్ ఎసై లు శివకుమార్, శ్యాం సుందర్ ఎస్పిసీసీ శ్రినివాస్,హెడ్ క్వార్టర్ ఇన్చార్జి ఆర్ఐ వామన మూర్తి, పి.ఆర్.ఓ మనొహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment