గిరిజన ప్రాంతంల్లో కొమురంభీం జిల్లా పోలీసులు ప్రజా అవగాహనా సదస్సులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 28 ; (వుదయం ప్రతినిధి) ; ప్రజలకోసమే పోలీసులు అంటూ కొమురం బీమ్ జిల్లా పోలీసులు ప్రతి గ్రామాలలో ఫ్రెండ్లి పోలీస్ మరియు పోలీస్ గ్రామసభలు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్య పరచటంలో ముందుంటున్నారు. ఆదివారం నాడు సిర్పూరు యు మండలంలోని కొద్దిగూడ గ్రామంలో సిర్పూరు ,(యు) ఎస్.ఐ రామారావు గ్రామ ప్రజలకు జీవన శైలిపై అవగాహనా కల్పించారు. నకిలీ విత్తనాలు పట్ల రైతులు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యత లేని విత్తనాల ను నాటి నష్టాల పాలు కావద్దని సూచించారు. ఇలా మోసపూరిత విత్తనాలను అమ్ముతున్నా దళారుల గురించి సమాచారమందించాలని కోరారు. కొమురంభీం జిల్లా ఎస్ పి సన్ప్రీత్ సింగ్ ఆదేశాలమేరకు గ్రామప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలో గిరిజన రైతులను పోలీసు సిబ్బంది గ్రామాప్రజలు పాల్గొనరు.
No comments:
Post a Comment