బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీస్ అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (వుదయం ప్రతినిధి) ; దహెగాం మండలంలోని గిరివెళ్లి గ్రామానికి చెందిన బాలిక(16) బాల్య వివహం అదే మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన తుమ్మిడి నానితో జూన్ 1వ తేదీన పెళ్లి అని తెలుసుకొని దహెగాం సబ్-ఇన్స్పెక్టర్ దికొండ రమేష్, వి .టి .ఓ ఎంబడి రమేష్ మరియు సిబంది వారిని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రయత్నాలను విరమింపచేశారు. ఈ బాలిక కస్తూరిబా బాలికల పాఠశాల లో 9వ తరగతి చదువుతున్నది అని చదువుకునే వయసులో పెండ్లిలు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు వారి చదువుకు ఆటంకం కలిగి భవిష్యత్తు దెబ్బతింటుంది అని బాలిక తల్లిదండ్రులకు అవగహన కల్పించి మైనర్ వివాహలు చట్టరిత్య నేరం అని బాలిక వివాహ వయస్సు కనీసం 18సంవత్సరాలు ఉండాలని వారి యొక్క ప్రయత్నాలను విరమింపచేశారు.
No comments:
Post a Comment