Thursday, 11 May 2017

మూడో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

మూడో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభం  


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 11 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్రము లో రైతులు పండించే పంటలకు ఎల్లకాలం పుష్కలంగా సాగునీరుని అందించే ఉద్ధ్యేశంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన చెరువుల పూడిక తీత మిషన్ కాకతీయ ఫేజ్ -3 పనులను గురువారం నాడు రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి ప్రారంభించారు. సందర్బంగా మండలంలోని నక్కలగూడ,తక్కెళ్ళపల్లి,రోళ్లపాడు, పుంజుమేరగూడ గ్రామాల్లోని పలు చెరువుల పూడిక తీత పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతులకు సాగు నీరు అందించలానే ముఖ్య ఉద్దేశంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం అని వారు  అన్నారు. ప్రతి రైతుకు సాగు నీరు అందించడమే ప్రధాన అంశంగా మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.తెలంగాణా ప్రభుత్వం వచ్చిన  తర్వాతే ప్రజా సౌకర్యాలు మేరుగుపడ్డాయని మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దరన,మరమత్తుల వల్ల సాగు భూములకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ఎంపిపి కార్నాథం  సంజీవ్  కుమార్,జడ్పిటిసి బాబురావు,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,తెరాస మండల అధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి,తెరాస నాయకులూ చిన్న సోమశేఖర్,నవీన్ కుమార్,సుదర్శణగౌడ్,మల్రాజ్ శ్రీనివాస్,మండలంలోని ప్రజాప్రతినిధులు,సర్పంచులు,ఎంపీటీసీలు,తెరాస నాయకులు,అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment