Tuesday, 16 May 2017

ప్రభుత్వం అన్ని వర్గాలకు చేయూత ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి

ప్రభుత్వం అన్ని వర్గాలకు చేయూత ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ; (వుదయం ప్రతినిధి) ;  గొల్లకురుమల ఆర్థిక అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ,  వీరితో పటు అన్నివర్గాల  ప్రజల కు లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ ఆర్ధిక అభివృద్ధి కి తోడ్పడుతున్నదని ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం లోని బూరుగూడా గ్రామంలో గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా కార్యక్రమానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమలు ఆర్థికంగా కుటుంబాల అభివృద్ధి  చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి గొల్లకురుమ కుటుంబాలకు 75శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను మంజూరు చేసిందని ఈ యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుందన్నారు. బూరుగుడా గ్రామం లో నిర్వహించిన లక్కీ డ్రా లో76 మంది లబ్దిదారులకు గాను 38 మందిని ఎంపికచేశారు. . ఈ కార్యక్రమంలో  ఆసిఫాబాద్  మార్కెట్ ఛైర్మన్ గందం శ్రీనివాస్, సర్పంచ్ మేకర్త్ కాశయ్య, మండల పశు అధికారి శ్రీకాంత్, ఎం పి టి సి చౌదరి గోపాల్, తెరాస నాయకులూ మరియు తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment