Thursday, 11 May 2017

ప్రజా సేవలో పోలీసులు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ప్రజా  సేవలో పోలీసులు  -  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 08 ; (వుదయం ప్రతినిధి) ;  ప్రజల సేవలలోనే పోలీసులు పని చేస్తుంటారని శాంతిభద్రతలు కాపాడే విషయము లో రాజీ పడే ప్రసక్తే ఉండదని  కుంరం భీం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం   జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పి   సన్ ప్రీత్  ఫిర్యాదు దారులనుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   కుంరం భీం జిల్లా లో పోలీసుల పట్ల గౌరవం తో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ నెలకొనివుంది అని దానిని ప్రజల సహకారంతో కొనసాగిస్తామని, అంతేకాక జిల్లా లో నేరాల, చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ను వేగం గా చేసేందుకు వీలుగా నూతన ఆధునిక పోకడలను జిల్లా లో ప్రారంభించాం అని తద్వారా నేరవిచారణ వేగముగా జరిగి బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని తెలిపారు. సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగం లో అసిఫాబాద్ ఫైకాజీ నగర్ కు చెందిన తెంగ్లీకర్ శ్రీను ,అసిఫాబాద్ కు చెందిన సలీం మున్నీసా బేగం లు తమ యొక్క భూవివాదం ను పరిష్కరించాలని కోరగా సమస్యను విచారించి తగిన న్యాయం చేస్తాము అని హమీ ఇచ్చారు. "ప్రజాఫిర్యాదు ల విభాగము ముగిసిన వేంటనే  జిల్లా ఎస్పి గారు జిల్లా లోగల అన్ని పోలీసుస్టేషన్ ల సీ ఐ లు ,ఎసై ల తో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. దీనిలో జిల్లా లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఉండే సొషల్ మీడియా లోని వైరల్ వీడియోలు ,ఫోటోలు పట్ల అప్రమత్తతతో  ఉండాలని అల చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు,  ,అసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీశ్ గారు ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత లు  పాల్గొన్నారు .                        ⁠⁠⁠⁠

No comments:

Post a Comment