Saturday, 27 May 2017

మతసామరస్యం,సోదరభావతోనే శాంతి సాధ్యం - ఎస్పి -సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

మతసామరస్యం,సోదరభావతోనే శాంతి సాధ్యం - ఎస్పి -సన్ ప్రీత్ సింగ్  ఐ.పి.స్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ;  దేశంలో అనేక కులాలు ,మతాలు ,వర్గాలు వున్నాయి అని ఏ వర్గం వారు,అ వర్గం కు సంబంధించిన  పండుగలను జరుపుకునేపుడు అన్ని  వర్గాలవారు మత సామరస్యం పాటించాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు తెలిపారు ,శనివారం కాగజ్ నగర్ లోని స్థానిక సంతోష్ ఫంక్షన్ హల్ లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారి అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం జరిగింది ,ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లొని ముస్లిం సోదరి, సోదరులందరు ,రంజాన్ మాసం ను, రంజాన్ ను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ముస్లింలకు రంజాన్ పండుగ విశిష్టమైనది పేర్కొన్నారు. జిల్లా లో రంజాన్ మాసము సందర్బంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల సహకారం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక శాంతి భద్రతల అదుపులో ప్రజల యొక్క బాగస్వామ్యం ఎంతో ముఖ్యము అని ,వారి సహకారం తోనే శాంతియుత వాతావరణం సాధ్యము అని ,ఎక్కడయితే అందరు సోదరభావం కలిసి మెలిసి వుంటారో అక్కడ అబివృద్ది జరిగి అందరు సంతోషంగా ఉంటారని తెలిపారు. కుమరంభీమ్ జిల్లా శాంతి యుతమైన జిల్లా అని ,ఇలాంటి మంచి పేరు ను మనం కాపాడుకోవడానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వున్నదని ఈ పవిత్ర మాసం లో ఎలాంటి ఆసాంఘిక ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలిసులకు సహకరించాలని కోరారు ,జిల్లా లో నేరాల అదుపునకు పోలీసు యంత్రంగము అంతా కష్టపడి మీకోసమే పనిచేస్తుందని, "ఫ్రెండ్లీ పొలీసింగ్ "లో బాగంగా పోలీసులు ప్రజలతో మమేకం అయి వారిలో భయం ను పోగొట్టి భరోసా కల్పిస్తున్నారన్నారు దీనితో ప్రజలు పోలీసులను తమ సన్నిహిత మిత్రులలా భావిస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఈ శాంతి సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,కాగజ్ నగర్ (T)సి ఐ నాగేందర్ ,కాగజ్ నగర్ (R)సి ఐ రమేష్ ,రెబ్బెన సి ఐ మదన్ లాల్ ,కాగజ్ నగర్ టౌన్ ఎసై రాజెశ్ ,మున్సిపల్  చైర్మన్  విద్యాదేవి ,MRO రామ్మోహన్ రావు  ,కౌన్సిలర్ సద్దాంహుస్సేన్ ,పీస్ కమిటీ సభ్యులు ,మాజీ మున్సిపల్ చైర్మన్ మఖ్బుల్ హుస్సేన్, ఫ్యామిలి కౌన్సెలింగ్ మెంబర్  మొహమ్మద్ వాహబ్ మరియు ఎస్పీ పి.ఆర్.ఓ మనోహర్, ఇతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment