నాణ్యమైన విత్తనాలనీ ఎంచుకొని విత్తన శుద్ధి చేసి నాటాలి ; ఎఓ మంజుల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; (వుదయం ప్రతినిధి) ; నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని విత్తన శుద్ధి చేసి నటినట్లైతే దిగుబడులు ఎక్కువ వస్తాయని ఎఓ మంజుల రైతులకు అవగాహనా కల్పించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన తెలంగాణ -మన వ్యవసాయం అవగాహన సదస్సులను రెబ్బెన మండలం లోని ప్రతి గ్రామం లో రైతులకు అవగాహనా కల్పిస్తూ అధిక దిగుబడులు సాధించే విధంగా రైతులను చితన్య పరుచుతున్నామని అన్నారు శనివారం కిష్టాపూర్ గ్రామా పంచాయితీలో ఏర్పాటు చేసిన రైతు అవగాహనా సదస్సులో ఎఓ మంజుల మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసి గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే నాటితే ఎక్కువ దిగుబడులు వస్తాయని అన్నారు.తక్కువ రేటులో విత్తనాలను కొనుగోలు చేసి దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని . ముక్యంగా అధిక దిగుబదులకు కారణం విత్తనం ఫై ఆధారపడి ఉంటుందని రాయితీ ఫై ప్రభుత్వం ప్రవేశ పెట్టె విత్తనాలను నాటితే అధిక దిగుబడులు దోహద పడుతాయని అన్నారు. ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటిస్తూ సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఈ అవగాహన సదస్సులో గ్రామ సర్పంచ్ భీమేష్ వ్యవసాయ సిబ్బందిని తదితర రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment